Gold smuggling: విమానంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. ఓ సీటు కింద కనిపించిందో పార్శిల్.. అనుమానంగానే దాన్ని ఓపెన్ చేసి చూస్తే..!

ABN , First Publish Date - 2022-07-28T02:39:17+05:30 IST

కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుని, ఎంత మందిని అరెస్ట్ చేస్తున్నా బంగారం అక్రమ రవాణా (Gold smuggling) ఆగడం లేదు.

Gold smuggling: విమానంలో కస్టమ్స్ అధికారుల తనిఖీలు.. ఓ సీటు కింద కనిపించిందో పార్శిల్.. అనుమానంగానే దాన్ని ఓపెన్ చేసి చూస్తే..!

కస్టమ్స్ అధికారులు ఎన్ని చర్యలు తీసుకుని, ఎంత మందిని అరెస్ట్ చేస్తున్నా బంగారం అక్రమ రవాణా (Gold smuggling) ఆగడం లేదు. దుబాయ్ (Dubai) నుంచి ఎప్పటికప్పుడు బంగారం భారత్‌కు అక్రమంగా రవాణా అవుతూనే ఉంది. కస్టమ్స్ అధికారుల కళ్ల కప్పేందుకు స్మగ్లర్లు రకరకాలు ఎత్తులు వేస్తున్నారు. వారికి ఎయిర్ లైన్స్ సిబ్బంది కూడా సహకరిస్తున్నారు. జైపూర్ విమానాశ్రయం ( Jaipur airport) లో కస్టమ్స్ బృందం ఒక కేజీ బంగారం (1 kg gold) బిస్కెట్‌ను స్వాధీనం చేసుకుంది. స్పైస్‌జెట్‌ విమానం సీటు కింద నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. 


ఇది కూడా చదవండి..

Google: పట్టు వదలని విక్రమార్కుడు.. 39 ప్రయత్నాల తర్వాత గూగుల్‌లో జాబ్ సాధించాడు.. వైరల్ అవుతున్న స్టోరీ


బిస్కెట్ రూపంలో తీసుకొచ్చిన ఆ కేజీ బంగారం మార్కెట్ ధర రూ.52.10 లక్షలు వరకు ఉంటుంది. ఈ కేసులో కస్టమ్స్ అధికారులు ఒక ప్రయాణికుడిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రమేయం కూడా ఉండొచ్చని కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. ఆ విమానంలో విధులు నిర్వర్తించిన ఐదుగురిని విచారణకు పిలిచారు. స్పైస్‌జెట్‌ విమానం దుబాయ్‌ నుంచి మంగళవారం సాయంత్రం జైపూర్‌ చేరుకుంది. కస్టమ్స్ అధికారులు ఆ ఫ్లైట్‌ని యాదృచ్ఛికంగా తనిఖీ చేసినప్పుడు, ఒక సీటు కింద ప్యాకెట్ కనిపించింది.  దాని లోపల ఒక కిలోగ్రాము బరువున్న బంగారు బిస్కెట్ ఉంది.


సీటు నంబర్ ఆధారంగా ప్రయాణికుడిని గుర్తించి విమానాశ్రయంలో నిలిపివేశారు. అతడిని కొద్దిసేపు విచారించగా అతడు నిజం అంగీకరించాడు. దుబాయ్ నుంచి తిరిగి వస్తుండగా ఒక యువకుడు తనకు ఈ ప్యాకెట్ ఇచ్చి సీటు కింద పెట్టాలని చెప్పినట్టు తెలిపాడు. తన ఖాతాలో రూ.10 వేలు వేసినట్టు చెప్పాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే విమానంలో స్వీపింగ్, టెక్నికల్ అసిస్టెన్స్, సెక్యూరిటీ సేవలు అందిస్తున్న ఐదుగురు ఉద్యోగులను కూడా విచారణకు పిలిచారు.  

Updated Date - 2022-07-28T02:39:17+05:30 IST