Abn logo
May 14 2021 @ 07:07AM

ఒడిశా జైళ్లలో 120 మంది ఖైదీలకు కరోనా

భువనేశ్వర్ (ఒడిశా): ఒడిశా రాష్ట్రంలోని జైళ్లలో 120 మంది ఖైదీలకు కరోనా సోకగా, వారిలో ఇద్దరు మరణించారు. ఒడిశా రాష్ట్రంలోని జైళ్లలో కరోనా ప్రబలుతుండటంతో 449మంది ఖైదీలను పెరోల్ పై విడుదల చేశామని ఒడిశా జైళ్ల శాఖ డీఐజీ శుభాకాంత మిశ్రా చెప్పారు. జైళ్లలో 120 మంది ఖైదీలకు కరోనా సోకడంతో వారిలో క్రిటికల్ రోగులను కొవిడ్ ఆసుపత్రులకు తరలించామని డీఐజీ చెప్పారు. ఇద్దరు ఖైదీలు కరోనాతో మరణించడంతో ఖైదీలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వ్యాప్తితో పట్నాఘడ్ సబ్ జైలు, బెర్హంపూర్ జైళ్లను కొవిడ్ కేర్ కేంద్రాలుగా మార్చామని డీఐజీ మిశ్రా పేర్కొన్నారు. ఒడిశాలో తాజాగగా 10,549 మందికి కరోనా సోకగా వారిలో 19 మంది మరణించారు. 

Advertisement
Advertisement
Advertisement