వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2021-09-17T04:51:03+05:30 IST

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 18సం వత్సరాలు వయస్సు పూర్తైన ప్రతీ ఒక్కరు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్ర త్యేక క్యాంపెయిన్‌ కా ర్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ వైద్యారోగ్య, మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు.

వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలి
వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌

- కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌


కల్వకుర్తి టౌన్‌, సెప్టెంబరు 16: నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 18సం వత్సరాలు వయస్సు పూర్తైన ప్రతీ ఒక్కరు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రత్యేక క్యాంపెయిన్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్‌ పి.ఉదయ్‌కుమార్‌ వైద్యారోగ్య, మునిసిపల్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటి నుంచి 15రోజులపాటు జిల్లాలో 254కేంద్రాల్లో ప్రత్యేక కాంపెయిన్‌ నిర్వహించి వ్యాక్సిన్‌ తీసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్‌ అందించాలని ఆదేశిం చారు. కల్వకుర్తి మునిసిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్‌ 21వ వార్డులో కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యా దవ్‌తో కలిసి ప్రత్యేక వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో రెండు రకాల బృందాలను ఏర్పాటు చేశామని, ఒకటి ప్రతీ ఇల్లు తిరిగి వివరాలు సేకరించి స్టిక్కర్‌ అతికించేందుకు, మరో టీమ్‌ గ్రామపంచాయతీ, మునిసిపాలిటీ వార్డులు, హాబిటేషన్లలో వ్యాక్సిన్‌ ఇచ్చే టీం ఏర్పాటు చేశామన్నారు.  సర్వే టీంలో అంగన్‌వాడీ, వీఏఓ బుక్‌కీపర్‌ లేదా సీసీఏలతో ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా 18సంవత్సరాలు నిండిన ప్రతీ విద్యార్థికి వ్యాక్సిన్‌ ఇప్పించే బాధ్యత ఆయా శాఖల అధికారులు తీసుకోవాలన్నారు.  వ్యాక్సినేషన్‌ పర్యవేక్షణ కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఏమైనా సమస్యలు లేదా ఫిర్యాదులు ఉంటే 08540230201 నెంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు. అనంతరం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రవాస భారతీయుడు అందించిన ఆర్థిక సహకారంతో నిర్మాణ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 30లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన 12పడకల ఐసీయూ కేంద్రాన్ని కలెక్టర్‌ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభించారు. ఆసుపత్రిలో గర్భిణులకు కేసీఆర్‌ కిట్టును అందజేశారు. మునిసిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, వైస్‌ చైర్మన్‌ షాహీద్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో వెంకటదాస్‌, ఆర్డీవో రాజేష్‌కుమార్‌, మునిసిపల్‌ కమిషనర్‌ జాకీర్‌అహ్మద్‌, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమేష్‌, నిర్మాణ సంస్థ ప్రతినిధి సుధీర్‌, ఎంపీపీ సునీత, వైస్‌ ఎంపీపీ బాలయ్య, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-17T04:51:03+05:30 IST