వందశాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-10-19T04:22:48+05:30 IST

గ్రామాల్లో వందశాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ సూచించారు. సోమవారం మండలంలోని సరండి గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలో వ్యాక్సిన్‌ తీసుకున్న వారి వివరా లను అడిగి తెలుసుకున్నారు.

వందశాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలి
సరండిలో డ్రెయినేజీని పరిశీలిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

వాంకిడి, అక్టోబరు18: గ్రామాల్లో వందశాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ సూచించారు. సోమవారం మండలంలోని సరండి గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలో వ్యాక్సిన్‌ తీసుకున్న వారి వివరా లను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లివ్యాక్సిన్‌ వేయించు కున్నారా లేదా వాకబు చేశారు. అనంతరం మురికి కాలువలను పరిశీ లిం చారు. 18సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్‌ వేయాలని సూచించారు. గ్రామంలో పారిశుధ్యం లోపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్‌వెంట తహసీల్దార్‌ మధుకర్‌, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, వైద్యాధికారి సతీష్‌ ఉన్నారు.

Updated Date - 2021-10-19T04:22:48+05:30 IST