Abn logo
Sep 24 2021 @ 23:46PM

కనకాపూర్‌ తండాలో వంద శాతం పూర్తి

కేక్‌ కట్‌ చేసి సంబురాలు జరుపుకుంటున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు

- 404 మందికి కొవిడ్‌ టీకా

- కేక్‌ కట్‌ చేసి సంబురాలు జరుపుకున్న తండావాసులు


మూసాపేట, సెప్టెంబరు 24: మహబూబ్‌నగర్‌ జిల్లా మూసాపేట మండలం చక్రాపూ ర్‌ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన కనకాపూర్‌ తండాలో కొవిడ్‌ టీకా వంద శా తం పూర్తి చేశారు. తండాలో 404 మంది ఉండగా అందరికీ టీకా వేశారు. దాంతో మండల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి శుక్రవారం తండాలో కేక్‌ కట్‌చేసి, సంబురా లు జరుపుకున్నారు. తండా వాసులు వైద్య సిబ్బందికి సహకరించి వ్యాక్సినేషన్‌ వేసుకున్నం దుకు ఎంపీడీవో ఉమాదేవి అభినందించారు. కన్కపూర్‌ తండాను స్ఫూర్తిగా తీసుకొని, ప్రతి గ్రామంలో వంద శాతం మంది వ్యాక్సినేషన్‌ తీసుకునేలా ప్రజాప్రతినిధులు, అధికారులు చూడాలని ఎంపీడీవో కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ మంజుల, ఎంపీవో సరోజ, సర్పంచ్‌ శైలజారెడ్డి, ఎంపీటీసీ పల్లవి, గ్రామ కార్యదర్శి సతీష్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.