ఒక్క హగ్‌తో ఎంతో మార్పు!

ABN , First Publish Date - 2021-11-25T05:30:00+05:30 IST

బాధలో ఉన్న వ్యక్తికి ఇచ్చే ఒక ప్రేమపూర్వక కౌగిలింత అతని మనసును ఎంతో తేలికపరుస్తుంది. అంతేకాదు....

ఒక్క హగ్‌తో ఎంతో మార్పు!

బాధలో ఉన్న వ్యక్తికి ఇచ్చే ఒక ప్రేమపూర్వక కౌగిలింత అతని మనసును ఎంతో తేలికపరుస్తుంది. అంతేకాదు మానసిక ఆరోగ్యానికి కౌగిలింత చాలా మంచిదని అంటున్నారు పరిశోధకులు. మాటల్లో చెప్పలేని భావాలను ఒక కౌగిలింత ద్వారా చేరతాయి. మాటలు లేకుండా భావాన్ని తెలియజేయడానికి ఇది శక్తిమంతమైన టూల్‌గా పనికొస్తుంది. కౌగిలింత ద్వారా స్ట్రెస్‌ హార్మోన్‌గా పిలిచే కార్టిసాల్‌ విడుదల తగ్గుతుందని శాస్త్రీయంగా నిరూపితమయింది. అంతేకాదు హగ్‌తో రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది. రోగనిరోధక శక్తి మెరుగుపడేలా చేయడంలోనూ సహాయపడుతుంది. ఒక నిమిషం కన్నా ఎక్కువ సమయంలో హగ్‌ ఇచ్చినట్టయితే మ్యాజికల్‌ కనెక్షన్‌ క్రియేట్‌ అవుతుందని పరిశోధకులు అంటున్నారు. గుండె ఆరోగ్యానికి ఉపయోగపడే ఆక్సిటోసిన్‌ ఉత్పత్తిని హగ్‌ పెంచుతుంది. ‘ఫైట్‌ ఆర్‌ ఫ్లైట్‌’ మోడ్‌ నుంచి బయటకు వచ్చేలా చేయడంలోనూ కౌగిలింత చక్కగా ఉపయోగపడుతుంది. ఇది నరాల వ్యవస్థను శాంతపరుస్తుంది.

Updated Date - 2021-11-25T05:30:00+05:30 IST