Abn logo
Dec 5 2020 @ 01:17AM

ప్రమాదవశాత్తు ఒకరి మృతి

కుంటాల, డిసెంబరు 4 : మండలంలోని లింబా (బి) గ్రామానికి చెందిన శ్రీకాంత్‌(24) ప్రమా దవశాత్తు మృతి చెంది నట్లు ఏఎస్సై రాందాస్‌ తెలిపారు. శ్రీకాంత్‌ త మ్ముడు మహేశ్‌ మద్యం సేవించి అతని తల్లిని డబ్బుల కొరకు వేధిస్తుం డగా అతన్ని తప్పిస్తున్న సమయంలో కాలుజారీ కింద పడి మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. మృతునికి భార్య, 5 నెలల కుమారుడున్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్సై  తెలిపారు. 


Advertisement
Advertisement