Advertisement
Advertisement
Abn logo
Advertisement

అగ్ర‌రాజ్యంలో కాల్పుల క‌ల‌క‌లం.. ఒక‌రు మృతి, 13 మందికి గాయాలు

అరిజోనా: అగ్ర‌రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటు చేసుకున్నాయి. అరిజోనాలోని వెస్ట్‌ ఫోనిక్స్‌లో ఓ దుండగుడు కేవ‌లం 90 నిమిషాల వ్యవధిలోనే మూడు ప్రాంతాల్లో కాల్పులకు తెగ‌బ‌డ్డాడు. దీంతో ఒక‌రు చనిపోగా, 13 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పియోరియా, సర్‌ప్రైజ్‌, గ్లెండెల్‌ పోలీసులు విభాగాలు ఎఫ్​బీఐ, అరిజోనా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీతో కలిసి దర్యాప్తు చేప‌ట్టాయి. ద‌ర్యాప్తులో భాగంగా ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక దేశ‌వ్యాప్తంగా త‌ర‌చూ కాల్పుల ఘ‌ట‌నలు చోటు చేసుకుంటున్న నేప‌థ్యంలో గ‌న్ క‌ల్చ‌ర్‌ను కట్టడి చేసేందుకు దేశ అధ్యక్షుడు జో బైడెన్ ఈ ఏడాది​ ఏప్రిల్‌లో​ కీలక నిర్ణ‌యం తీసుకున్నారు. సీరియల్​ నంబర్లు లేని గ‌న్స్‌తో పాటు నాటు తుపాకులపై ఆంక్షలు విధించారు. అయినా అగ్ర‌రాజ్యంలో కాల్పుల ఘ‌ట‌న‌లు ఆగ‌క‌పోవ‌డం గమనార్హం.

Advertisement

అమెరికా నగరాల్లోమరిన్ని...

Advertisement