ఒకదేశం- ఒకే ఎన్నికపై కర్ణాటక అసెంబ్లీలో రభస

ABN , First Publish Date - 2021-03-05T11:49:54+05:30 IST

దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై

ఒకదేశం- ఒకే ఎన్నికపై కర్ణాటక అసెంబ్లీలో రభస

సభలో చర్చకు అనుమతి

విపక్ష కాంగ్రెస్‌ అభ్యంతరం

చొక్కా గుండీలు విప్పేసి ఎమ్మెల్యే సంగమేశ్‌ వీరంగం

సభ నుంచి వారం పాటు సస్పెండ్‌


బెంగళూరు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు.  గురువారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ విశ్వేశహెగ్డే కాగేరి ఒకే దేశం- ఒకే ఎన్నిక అంశంపై చర్చకు అనుమతిచ్చారు. దీనిపై  ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. అందుకు స్పీకర్‌ అవకాశమివ్వలేదు. పోడియం వద్దకు దూసుకెళ్లిన సభ్యులు పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ కావాలంటూ నినాదాలు చేశారు. సంబంధిత ప్రతులను చించేశారు. భద్రావతి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంగమేశ్‌ షర్టు బటన్‌లు తీసి వీరంగం చేశారు. దీంతో సభ 15 నిమిషాల పాటు వాయిదా పడింది. ఆ తర్వాత సభ ప్రారంభం కాగానే శానససభా వ్యవహారాల శాఖ మంత్రి సూచన మేరకు సంగమేశ్‌పై వారం రోజుల పాటు సస్పెన్షన్‌ వేటు వేశారు. దీంతో సభలో మరోసారి గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. దేశంలో ఆర్‌ఎ్‌సఎస్‌ ఆలోచనలకు అనుగుణమైన విధానాలు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. సభ నుంచి బయటకు వచ్చాక సంగమేశ్‌ మాట్లాడుతూ..  స్పీకర్‌ బీజేపీ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాగా శాసనసభలో ఎటువంటి ప్రస్తావన లేకున్నా లాంజ్‌లో ప్రతి చోటా సభ్యులు.. రమేశ్‌ జార్కిహోళి రాసలీల అంశంపై  గుసగుసలాడారు. 


మేం ఆర్‌ఎ్‌సఎస్‌ వాళ్లమే..

ఆర్‌ఎ్‌సఎస్‌ గురించి మాట్లాడే హక్కు కాంగ్రె్‌సకు లేదని సీఎం యడియూరప్ప అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై శాసనసభలో చర్చ జరుగుతుండగా కాంగ్రెస్‌ సభ్యులు పోడియం వద్ద నిరసన తెలుపుతూ.. ఆర్‌ఎ్‌సఎస్‌ సిద్దాంతాలను ప్రజలపై బలవంతంగా రుద్దుతున్నారని ఆరోపించారు. దీనిపై సీఎం యడియూరప్ప స్పందిస్తూ.. ఆర్‌ఎ్‌సఎస్‌ గురించి మాట్లాడే నైతికహక్కు కాంగ్రెస్‌ సభ్యులకు లేదన్నారు. తాముఆర్‌ఎ్‌సఎస్‌ వాదులమేనని ప్రధానమంత్రి మోదీ కూడా ఆర్‌ఎ్‌సఎస్‌ వారే అని స్పష్టం చేశారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరగడం ద్వారా అభివృద్ది మరింత సాఽధ్యమన్నారు. కాగా ఈ సమయంలో స్పీకర్‌ జోక్యం చేసుకుంటూ.. సభకు సంబంధం లేని ఆర్‌ఎ్‌సఎస్‌ ప్రస్తావన ఎందుకని ప్రతిపక్ష సభ్యులను మందలించారు. కాగా ఈ నెల 8న బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండగా.. నెలాఖరుదాకా సమావేశాలు జరపాలని నిర్ణయించారు. 

Updated Date - 2021-03-05T11:49:54+05:30 IST