Abn logo
Sep 24 2021 @ 15:04PM

వన్‌కార్డ్‌+ఫెడరల్ బ్యాంక్... మొబైల్ క్రెడిట్ కార్డ్

హైదరాబాద్ : వన్‌కార్డ్‌+ఫెడరల్ బ్యాంక్ = మొబైల్ క్రెడిట్ కార్డ్(అంటే... మొబైల్ ఆధారిత క్రెడిట్ కార్డ్). ఈ కార్డునందించే క్రమంలో... ఫిన్‌టెక్ సంస్థ‌ వన్‌కార్డ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. రానున్న పండుగ సీజ‌న్‌లో వినియోగదారులకు మరింత ద‌గ్గ‌రయ్యేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఫెడరల్ బ్యాంకు తెలిపింది. కరోనా నుండి భారత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. ఈ నేపధ్యంలో పండుగ సీజన్‌లో డిమాండ్ పుంజుకుంటుందనే అంచనాలున్నాయి. ఫెడరల్ బ్యాంకు ఈ క్రెడిట్ కార్డును వన్-కార్డ్ యాప్ ద్వారా కేవలం మూడు నిమిషాల్లోనే జారీ చేస్తుంది. అయితే ఫిజికల్ కార్డు వచ్చేంతవరకు కూడా ఈ వర్చువల్ కార్డును వినియోగించుకోవచ్చు. ఈ యాప్ ద్వారా కస్టమర్లు తమ క్రెడిట్ కార్డులను నియంత్రించుకునే వెసులుబాటు ఉంటుంది.