రాజధాని గ్రామాల్లో ఉద్యమం తీవ్రతరం

ABN , First Publish Date - 2020-08-06T16:42:21+05:30 IST

రాజధాని గ్రామా ల్లో ఉద్యమం తీవ్రతరం అవుతోంది. తుళ్లూరు, పెదపరిమి..

రాజధాని గ్రామాల్లో ఉద్యమం తీవ్రతరం

కొత్తగా దీక్షా శిబిరాల ఏర్పాటు

232వ రోజుకు చేరుకున్న ఆందోళనలు


తుళ్లూరు, తాడికొండ(గుంటూరు): రాజధాని గ్రామా ల్లో ఉద్యమం తీవ్రతరం అవుతోంది. తుళ్లూరు, పెదపరిమి, వెలగపూడి, మందడం కృష్ణాయపాలెం, యర్రబా లెం గ్రామాల్లోని శిబిరాల్లో దీక్షలు కొనసాగుతున్నాయి. వీటితో పాటు అబ్బరాజుపాలెం, ఉద్దండ్రాయునిపాలెం, అనంతవరం గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. భౌతికదూరం పాటిస్తూనే ఆందోళనలు చేపడు తున్నారు. రాజధాని రైతులు చేపట్టిన ఆందోళనలు బుధవారం 232వ రోజుకు చేరుకున్నాయి. రాజధాని రైతుల ఉద్యమానికి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వంగవీటి రాధా బుధవారం సంఘీభావం తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగపూడి గోపాలకృష్ణ అమరావతి రైతులకు మద్దతు ప్రకటించారు.


అమరావతికి బీజేపీ కట్టుబడిందని రైతులకు హామీ ఇచ్చారు. ఎటువంటి ఆటంకం లేకుండా అయోధ్యలో రామాల యం నిర్మాణం జరగాలని.. అదేవిధంగా రాష్ట్రంలో అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగాలని శ్రీరామునికి మందడం, వెలగపూడి, తుళ్లూరు, కృష్ణాయ పాలెం మహిళా రైతులు పూజలు నిర్వహించారు.  అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా మహిళా రైతులు రాత్రి 7 గంటల సమయంలో ఇళ్ల వద్ద దీపాలు వెలిగించి అమరాతిని కొనసాగించండి అంటూ ప్రభు త్వాన్ని వేడుకున్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకం గా తాడికొండ మండలం పొన్నెకల్లు, మోతడక రైతులు బుధవారం నిరసనలు వ్యక్తం చేశారు. అమరావతే రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉండాలనేది కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతమని ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంటు ఎస్‌కే మస్తా న్‌వలి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకా విజయ్‌తో కలిసి ఆయన తుళ్ళూరులో నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మస్తాన్‌వలి మాట్లాడుతూ మూడు ముక్కల రాజధానులతో రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో జగన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ,  లింగంశెట్టి ఈశ్వరరావు, కొమ్మినేని సురేష్‌, తదిత రులు పాల్గొన్నారు. 


అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం రాజధాని డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఉండవల్లి సీపీఎం కార్యాలయం వద్ద బుధవారం నినాదాలు చేశారు.  సీపీఎం రాజధాని డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఎం.రవి, నేతలు వల్లభాపురం వెంకటేశ్వరరావు, ఎస్‌కే ఎర్రపీరు, సుందరరావు, సుందరయ్య, భాగ్యరాజు, రైతునేతలు పాల్గొన్నారు.  యర్రబాలెం గ్రామంలో రైతులు, అమరావతి జేఏసీ ప్రతినిధులు నిరసన వ్యక్తం చేశారు. ఆకుల జయసత్య, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బేతపూడిలో ఆందోళనల్లో రైతులు, గ్రామస్తులు పాల్గొని నిరసనలు తెలిపారు.

Updated Date - 2020-08-06T16:42:21+05:30 IST