అన్ని వేరియంట్లకూ ఒకే బూస్టర్‌!

ABN , First Publish Date - 2022-08-16T06:43:33+05:30 IST

ఆల్ఫా, బీటా, గామా, డెల్టా లాంటి పాత వేరియంట్లకే కాక కొత్తగా పుట్టుకొచ్చిన ఒమైక్రాన్‌ సహా అన్ని వేరియంట్లపైనా పనిచేసే బూస్టర్‌ టీకాను..

అన్ని వేరియంట్లకూ ఒకే బూస్టర్‌!

మోడెర్నా బూస్టర్‌ డోసుకు యూకే ఓకే.. త్వరలో భారత్‌కూ: పూనావాలా


లండన్‌/న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఆల్ఫా, బీటా, గామా, డెల్టా లాంటి పాత వేరియంట్లకే కాక కొత్తగా పుట్టుకొచ్చిన ఒమైక్రాన్‌ సహా అన్ని వేరియంట్లపైనా పనిచేసే బూస్టర్‌ టీకాను మోడెర్నా సంస్థ తీసుకొచ్చింది. క్లినికల్‌ ట్రయల్స్‌ అనంతరం యూకే ప్రభుత్వం దీన్ని ఆమోదించింది. ఈ బూస్టర్‌లో సగం మోతాదు 2020లో వచ్చిన తొలి రకం వైర్‌స ను, మిగిలిన సగం టీకా ఒమైక్రాన్‌ను లక్ష్యంగా చేసుకుని పోరాడుతుందని వివరించింది. దీన్ని మోడెర్నా బైవాలెంట్‌ బూస్టర్‌ వ్యాక్సిన్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు.. మోడెర్నా బూస్టర్‌ టీకాను భారత్‌కు తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎ్‌సఐఐ) చీఫ్‌ అదర్‌ పూనావాలా తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.


మరో 6నెలల్లో ఇది దేశంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒమైక్రాన్‌ను లక్ష్యంగా చేసుకునే ఇటువంటి బూస్టర్‌ డోసు భారత ప్రజలకు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించి ఇప్పటికే విదేశాల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ ముగిసిన నేపథ్యంలో భారత్‌లో ఆమోదానికి మరోమారు పరీక్షలు నిర్వహిస్తారా లేదా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. 

Updated Date - 2022-08-16T06:43:33+05:30 IST