‘గాంధీ’లో చక్రం తిప్పుతున్న ఒకే ఒక్కడు.. ప్రతీదీ ఆయన కనుసన్నల్లోనే..

ABN , First Publish Date - 2022-06-02T15:07:55+05:30 IST

‘గాంధీ’లో చక్రం తిప్పుతున్న ఒకే ఒక్కడు.. ప్రతీదీ ఆయన కనుసన్నల్లోనే..

‘గాంధీ’లో చక్రం తిప్పుతున్న ఒకే ఒక్కడు.. ప్రతీదీ ఆయన కనుసన్నల్లోనే..

  • ఆయన మెప్పుపొందిన వారికే కాంట్రాక్ట్‌లు 
  • పైరవీలు చేసి కాంట్రాక్ట్‌లు రద్దు

హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : గాంధీ ఆస్పత్రి (Gandhi Hospital) పాలనా విభాగంలో కీలక వ్యక్తి ఆయన. ఆస్పత్రి ప్రతీ విభాగంలోనూ ప్రతీదీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. కాంట్రాక్టర్‌ ఎవరైనా తాను చెప్పినట్లు నడుచుకోవాల్సిందే. లేదంటే ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేయించగల సమర్థుడు ఆయన. గాంధీలో నర్సుల ఆందోళనలకు ఆయనే కారణమని అంటున్నారు. నచ్చని కాంట్రాక్టర్‌ను తప్పించి కొత్త వారికి ఇప్పించాడు. ఆయన కొంతమంది నర్సులను విధుల నుంచి తొలగించడంతో వారు ఆందోళనకు దిగారు. గాంధీ ఆస్పత్రిలో ఒకరు పాలనా వ్యవహారాలను తన చెప్పుచేతల్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొత్తగా వచ్చిన పదిమంది కాంట్రాక్టర్లలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న ముగ్గురిని తప్పించాడు.


సూపరింటెండెంట్‌ సహాయంతో కలెక్టర్‌ వద్దకు వెళ్లి మూడు కాంట్రాక్ట్‌లను రద్దు చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక్కో కాం ట్రాక్టర్‌ వద్ద ఆయాలు, పారిశుధ్య కార్మికులు, నర్సులు, సెక్యూరిటీ గార్డులు, పేషెంట్‌ కేర్‌ వార్డు బాయ్‌లు దాదాపు వందమంది పనిచేస్తుంటారు. ఆయన కొత్తగా తీసుకొచ్చిన ఓ కాంట్రాక్టర్‌, 36 మంది నర్సులను విధుల నుంచి తొలగించాడు. వారంతా కరోనా సమయంలో ఆస్పత్రిలో విధులు నిర్వహించారు. దీంతో వారు ఇటీవల ఆందోళనకు దిగారు. మూడు నెలల నుంచి జీతాలు రావడం లేదని ఇతర సిబ్బంది కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఒక నర్సును ఐదు గంటలపాటు పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించడం వివాదాస్పదంగా మారింది.

Updated Date - 2022-06-02T15:07:55+05:30 IST