ఈషా ఐవీఎఫ్‌ ఫెర్టిలిటీలో ఆంకో ఫెర్టిలిటీ క్లినిక్ ప్రారంభం

ABN , First Publish Date - 2022-07-29T00:28:03+05:30 IST

బంజారాహిల్స్‌లోని ఈషా ఐవీఎఫ్‌ ఫెర్టిలిటీ సెంటర్‌.. షీల్డ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంయుక్తంగా సీఎంఈ (కంటిన్యూయేషన్‌

ఈషా ఐవీఎఫ్‌ ఫెర్టిలిటీలో ఆంకో ఫెర్టిలిటీ క్లినిక్ ప్రారంభం

హైదరాబాద్: బంజారాహిల్స్‌లోని ఈషా ఐవీఎఫ్‌ ఫెర్టిలిటీ సెంటర్‌.. షీల్డ్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంయుక్తంగా సీఎంఈ (కంటిన్యూయేషన్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌)ను కేన్సర్, కేన్సరేతర పరిస్థితుల్లో గర్భధారణ శక్తి సంరక్షణపై పార్క్ హయత్ హోటల్‌లో సదస్సు నిర్వహించారు. డాక్టర్‌ చందన లక్కిరెడ్డి (సీనియర్‌ ఐవీఎఫ్‌ స్పెషలిస్ట్‌, ఈషా ఐవీఎఫ్‌  ఫెర్టిలిటీ, హైదరాబాద్‌) డాక్టర్‌ సతీష్‌ అడిగ (ప్రొఫెసర్‌, హెచ్‌ఓడీ, కస్తూర్బా మెడికల్‌ కాలేజీ, మణిపాల్‌), డాక్టర్‌ శ్రీనివాస్‌ చక్రవర్తి (మెడికల్‌ ఆంకాలజిస్ట్‌, అపోలో హాస్పిటల్స్‌), డాక్టర్‌ సచిన్‌ మర్దా (సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌, యశోద హాస్పిటల్స్‌), డాక్టర్‌ సాయి లక్ష్మి దాయన (గైనకాలజిక్‌ ఆంకాలజిస్ట్‌, అపోలో హాస్పిటల్స్‌), డాక్టర్‌ ఎల్‌ జయంతి రెడ్డి (కన్సల్టెంట్‌ ప్రసూతి వైద్యులు, జేజే హాస్పిటల్‌), డాక్టర్‌ ఫాహ్మిదా బాను (కన్సల్టెంట్‌ ప్రసూతి వైద్యులు, ఫెమికేర్‌ హాస్పిటల్స్‌), డాక్టర్‌ శారద మామిళ్ల (కన్సల్టెంట్‌ ప్రసూతి వైద్యులు, యశోద హాస్పిటల్స్‌), డాక్టర్‌ విమీ బింద్రా (కన్సల్టెంట్‌ ప్రసూతి వైద్యులు,అపోలో హాస్పిటల్స్‌), డాక్టర్‌ శారద వాణి (కన్సల్టెంట్‌  ప్రసూతి వైద్యులు, అంకుర హాస్పిటల్స్‌), డాక్టర్ యశస్విని షెనాయ్‌ (చీఫ్‌ ఎంబ్రాయిలజిస్ట్‌, ఈషా ఐవీఎఫ్‌  ఫెర్టిలిటీ), డాక్టర్‌ పుష్ప రాగవేణి (కన్సల్టెంట్‌  సైకాలజిస్ట్‌. ఈషా ఐవీఎఫ్‌ సెంటర్‌), డాక్టర్‌ చాందిని చింతా (అసోసియేట్‌ కన్సల్టెంట్‌, ఈషా ఐవీఎఫ్‌ సెంటర్‌) వంటి నిపుణులు పాల్గొన్నారు.


ఈ నిర్దిష్టమైన సీఎంఈతో పాటుగా ఈషా ఐవీఎఫ్‌ ఫెర్టిలిటీ సెంటర్‌ వద్ద ఆంకో ఫెర్టిలిటీ క్లినిక్‌ను ప్రారంభించారు. ఇక్కడ కేన్సర్ రోగులకు పూర్తి ఉచితంగా కన్సల్టేషన్‌ సేవలను అందించడంతో పాటుగా కేన్సర్, దాని చికిత్స గర్భధారణ  శక్తిపై చూపే ప్రభావం గురించి వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చందన లక్కిరెడ్డి మాట్లాడుతూ.. శాస్త్రీయ సదస్సును నిర్వహించడంతో పాటుగా ఈషా ఐవీఎఫ్‌  ఫెర్టిలిటీ వద్ద ఆంకో ఫెర్టిలిటీ క్లినిక్‌ను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. కేన్సర్‌ (ఆంకాలజీ), ఆంకాలజీయేతర (నాన్‌ ఆంకాలజీ) పరిస్థితులలో సంతానోత్పత్తి పరిరక్షణ పట్ల అవగాహన మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. అలాగే, డాక్టర్ సచిన్ మర్దా, డాక్టర్‌ సాయిలక్ష్మి దాయన, డాక్టర్‌ సతీష్‌ అడిగ తదితరులు మాట్లాడుతూ తమ అభిప్రాయాలను వెల్లడించారు.


ఈ సీఎంఈ ద్వారా కేన్సర్‌, క్యాన్సరేతర కారణాలు అయినటువంటి  ఎండోమెట్రియోసిస్‌ చేత ఇబ్బంది పడుతున్న రోగులలో సంతానోత్పత్తి పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడం లక్ష్యంగా చేసుకున్నారు. ఈ కార్యక్రమంలోనే అత్యంత ఆసక్తికరమైన సదస్సులను  సుప్రసిద్ధ కేన్సర్‌ నిపుణులు, గైనకాలజిస్ట్‌లు నిర్వహించారు. వాస్తవానికి 5 శాతం కేన్సర్లు మాత్రమే 20–39 సంవత్సరాల లోపు వయసు వ్యక్తులలో వెలుగు చూస్తున్నాయి. పలు రకాల కేన్సర్‌లలో  జీవించేందుకు అవకాశాలు 80 శాతానికిపైగానే ఉన్నాయి. అందుబాటులో ఉన్న  సమాచారం ప్రకారం..  యుక్త వయసులో ఉన్న అంటే 35 సంవత్సరాల లోపు వయసు కలిగి, చికిత్స సమయానికి పిల్లలు లేని ప్రతి నలుగురు కేన్సర్‌ రోగులలో ముగ్గురు పిల్లలు కనాలనుకుంటున్నారు. కేన్సర్‌ చికిత్స కారణంగా అండాలు, వీర్యకణాలపై తీవ్ర ప్రభావం  పడవచ్చు. మహిళలల్లో  అండాశయంపై ప్రభావం పడితే,  మగవారిలో వృషణాలపై కూడా ప్రభావం పడవచ్చు. ఫలితంగా కేన్సర్‌తో పోరాడి విజయం సాధించిన వ్యక్తులలో వంధ్యత్వం ఒక అవరోధంగా నిలుస్తోంది. సంతానోత్పత్తి పరిరక్షణపై  విద్యాసదస్సుకు హాజరైన డాక్టర్లలో  అధికశాతం మంది సంతానోత్పత్తి పట్ల రోగుల  కోరికను కూడా పరిగణలోకి తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. రోగులు చికిత్సకు సిద్ధమైనప్పుడు ఈ అంశాలను గురించి చర్చించాల్సి ఉందని 44శాతం మంది అభిప్రాయపడ్డారు.

Updated Date - 2022-07-29T00:28:03+05:30 IST