మళ్లీ పెరుగుతున్న తిరస్కరణ బేళ్లు

ABN , First Publish Date - 2021-06-24T05:36:13+05:30 IST

దక్షిణాది పొగాకు మార్కెట్‌ ఏమాత్రం కుదుట పడటం లేదు. వ్యాపారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మార్కెట్‌ నడస్తోంది. రై తులకు మేలు చేసేలా వారిని నియంత్రించలేక పొోగాకు బోర్డు ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. దీంతో మళ్లీ రోజువారీ మార్కెట్‌లో భారీగా బేళ్లు తిరస్కరణలు జరుగుతున్నాయి. మేలు రకం బేళ్లకు సైతం సరైన ధరలు లభించకపోతుం డగా లోగ్రేడ్‌లను కొనేవారే కనిపించడం లేదు.

మళ్లీ పెరుగుతున్న తిరస్కరణ బేళ్లు

 తాజాగా 18.81 శాతానికి చేరిన వైనం 

మేలు రకానికీ తగ్గుతున్న ధరలు 

లోగ్రేడ్‌ల వైపు చూడని వ్యాపారులు  

నామమాత్రంగా ఎక్స్‌పోర్టు కంపెనీల కొనుగోళ్లు  

 నియంత్రణలో పొగాకు బోర్డు వైఫల్యం  

అయోమయంలో రైతులు 

నేడు ఒంగోలుకు బోర్డు చైర్మన్‌, ఈడీలు రాక 


ఒంగోలు, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్‌ ఏమాత్రం కుదుట పడటం లేదు. వ్యాపారులు ఆడిందే ఆట, పాడిందే పాటగా మార్కెట్‌ నడస్తోంది. రై తులకు మేలు చేసేలా వారిని నియంత్రించలేక పొోగాకు బోర్డు ప్రేక్షక పాత్ర వహిస్తున్నది. దీంతో మళ్లీ రోజువారీ మార్కెట్‌లో భారీగా బేళ్లు తిరస్కరణలు జరుగుతున్నాయి. మేలు రకం బేళ్లకు సైతం సరైన ధరలు లభించకపోతుం డగా లోగ్రేడ్‌లను కొనేవారే కనిపించడం లేదు. మార్కెట్లో గుత్తాధిపత్యంవహించే ఐటీసీ లెక్కకు అధిక వాటా కొను గోలు చేస్తున్నప్పటికి పోటీ లేక తక్కువ ధరలు ఇస్తున్నా రని రైతులు వాపోతున్నారు. నిన్నమొన్నటి వరకు విదేశీ ఆర్డర్లు ఖరారు గురించి సాకులు చెప్పిన ఎక్స్‌పోర్టర్లు ప్ర స్తుతం తమకు సదరు కంపెనీలు ఆఫర్‌ చేసిన ధరలు చాలా తక్కువగా ఉన్నాయని కొనుగోళ్లకు ముందుకు రావ డం లేదు. ఈ ప్రభావం మొత్తం మార్కెట్‌పై పడి మేలు రకం గ్రేడ్‌లకుసైతం ధరలు తగ్గడంతో పాటు కొన్ని రకా ల గ్రేడ్‌లకు డిమాండ్‌ లేకుండా పోయింది. దీంతో రైతు లు ఆందోళన చెందుతున్నారు. 


కలిగిరిలో వేలాన్ని అడ్డుకున్న రైతులు


కలిగిరి వేలం కేంద్రంలో నిత్యం 30శాతం తిరస్కరణ లు ఉంటుండటంతో బుధవారం రైతులు వేలం నిలిపివే శారు. ఈ ఏడాది దక్షిణాదిలోని 11 పొగాకు వేలం కేంద్రా ల పరిధిలో సుమారు 71 మిలియన్‌ కిలోల పంట ఉత్ప త్తి అంచనాతో మార్చి 15న కొనుగోళ్లు ప్రారంభించారు. ఇ ప్పటి వరకు సుమారు 36.10 మిలియన్‌ కిలోల కొనుగోళ్లు జరగ్గా సగటున కిలోకు రూ.155.05 ధర లభించింది. గత వారం రోజుల్లోనే కిలోకు సగటున రూ.2వరకు తగ్గిపోయి ంది.  తొలిపక్షం కాస్తంత డిమాండ్‌గా సాగిన మార్కెట్‌ అ నంతరం మందగించింది. ఎక్స్‌పోర్టు కంపెనీలు విదేశీ ఆ ర్డర్లు పేరుతో కొంత మెలిక పెట్టడం తర్వాత కరోనా ఎ ఫెక్టుతో మార్కెట్‌ ముందుకు సాగలేదు. ఈనెలలో తిరిగి వేలం కొనసాగుతుండగా పదిరోజుల క్రితం కొంత మెరు గ్గా ఉన్నట్లు కనిపించినా మార్కెట్‌ మళ్ళీ వారంనుంచి మ ందగించింది. గతంతో పోల్చుకుంటే రోజువారీ  వేలంకు వచ్చే బేళ్ల సంఖ్య గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం దా దాపు 9వేల బేళ్ళకు పైగా తెస్తున్నారు. అయితే తిరస్క రణల బేళ్ళు సంఖ్య కూడా పెరగడం రైతులకు అందోళన కలిగిస్తున్నది. ఈవారంలో చూస్తే దక్షిణాదిలోని 11వేల కేంద్రాల్లో సోమ, మంగళవారాల్లో సగటున 16శాతానికి పైగా బేళ్ళు తిరస్కరణలు జరిగాయి. బుధవారం కూడా అదే పరిస్థితి కనిపించింది.   మిగిలిన 10 కేంద్రాల్లో కలి పి 8,816 బేళ్ళు వేలంకు రాగా 7,139 మాత్రమే కొనుగోళ్ళు జరిగాయి. అలా 18.81శాతం బేళ్ళు తిరస్కరణలు జరిగా యి. కలిగిరిలో వేలం నిలిచిపోగా కనిగిరిలో 24శాతం తిర స్కరణలు జరిగాయి. ఒంగోలు-2 వేలం కేంద్రంలో ఏకం గా 38.77శాతం బేళ్లు తిరస్కరించారు. ఇలాంటి పరిస్థితే వారం రోజులుగా పలు కేంద్రాల్లో నిత్యం జరుగుతున్నది.


మేలు రకానికీ ధరలు తగ్గించారు..


 గతంలో మేలు రకం బేళ్లను హాట్‌హాట్‌గా కొని మీ డియం, లో గ్రేడ్‌లు పట్ల ఆసక్తిని చూపలేదు. ప్రస్తుతం వ్యాపారులు మేలు రకం ధరలు కూడా తగ్గించి వేశారు. చివరకు శీతల గిడ్డంగులలో అధిక వ్యయం చేసి నిల్వ ఉంచి తెస్తున్న బేళ్ళను కూడా ఆశించిన ధర కాకపోయినా ఈ ఏడాది తొలిరోజుల్లో ఉన్న ధరలు కూడా ఇవ్వడం లే దని రైతులు వాపోతున్నారు. లెక్కకు ఆయా వేలం కేం ద్రాల్లో గరిష్ఠ ధర  కిలో రూ.180 ఉంటున్నా అవి రెండు, మూడు బేళ్ళకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. శీతల గిడ్డంగుల నుంచి తెచ్చిన బేళ్ళను సైతం కిలో రూ.170 నుంచి రూ.175లోపే కొంటున్నారు. దీంతో ఆ బేళ్లు అధికం గా తిరస్కరణలు జరుగుతున్నాయి. ఇక లోగ్రేడ్‌లను నా మమాత్రంగా కూడా కొనడం లేదు. ఆయా వేలం కేంద్రా ల్లో కనిష్ఠ ధరలు కిలో రూ.100  ఉంటుండగా, లోగ్రేడ్‌ బే ళ్ళను ఆ ధరకు కూడా కొనేందుకు వ్యాపారులు ముందు కు రాక అవీ తిరస్కరణలు జరుగుతున్నాయి. మీడియం గ్రేడ్‌లు, బ్రౌన్‌, పచ్చరకం బేళుల ఏదో ఒక ధరకు వెళ్లి పోతున్నాయి. మొత్తంగా ఎక్స్‌పోర్టర్లు కొనుగోళ్లలో అంతగా ఉండకపోతుండటంతో మార్కెట్‌లో పోటీ కనిపించడం లేదు. ఇలాంటి సమయంలో వ్యాపారులను అదిలించి రై తులకు మేలు జరిగేలా చూడాల్సిన పొగాకు బోర్డు ప్రేక్షక పాత్రకు వహిస్తోంది. దీంతో వ్యాపారులదీ ఇష్టారాజ్యంగా మారింది. 


నేడు చైర్మన్‌ వేలం పరిశీలన


ఈనేపథ్యంలో పొగాకు బోర్డు చైర్మన్‌ రఘునాథబాబు, ఈడీ శ్రీధర్‌బాబు ఏరువాక పేరుతో గురువారం జిల్లాకు వస్తున్నారు. ఒంగోలు-2 వేలంకేంద్రం వద్ద జరిగే ఏరువా క కార్యక్రమంలో పాల్గొని పొగాకు వేలాన్ని పరిశీలిస్తారు. కాగా మార్కెట్‌ పరిస్థితిని పరిశీలించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. 


Updated Date - 2021-06-24T05:36:13+05:30 IST