Jun 11 2021 @ 09:45AM

మరోసారి అక్షయ్ కుమార్ - భూమి పడ్నేకర్

బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ - భూమి పడ్నేకర్ జంట కిలిసి మరోసారి నటించబోతున్నారు.  ఆనందర్ ఎల్. రాయ్ దర్శకత్వంలో "రక్షాబంధన్" తెరకెక్కుతోంది. ఇందులో భూమి పడ్నేకర్ నటిస్తున్న విషయాన్ని తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. అక్షయ్, భూమి గతంలో 'టాయిలెట్ : ఏక్ ప్రేమ్ కథ' సినిమాలో జంటగా నటించారు. తాజాగా ‘రక్షాంబంధన్’ మూవీ అప్ డేట్ తెలియజేస్తూ అక్షయ్ కుమార్ ఓ ఫోటోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. ఇందులో ఆనంద్ ఎల్. రాయ్, అక్షయ్ కుమార్, భూమి పెడ్నేకర్ ఉన్నారు. 'భూమి పెడ్నేకర్ ని "రక్షాబంధన్" టీమ్ లోకి ఆహ్వానిస్తున్నాం!' అని అధికారీకంగా అక్షయ్ ప్రకటించాడు. ఇదే ఫోటోని తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన భూమి, 'అనందర్ ఎల్. రాయ్, అక్షయ్ లాంటి క్రియేటివ్ పవర్ హౌజెస్‌తో పని చేయటం అదృష్టంగా భావిస్తున్నాను!' అని తెలిపింది. 'రక్షాబంధన్'తో పాటూ 'పృథ్వీరాజ్', 'అత్రంగీ రే', 'బచ్చన్ పాండే', 'బెల్ బాటమ్', 'ఓ మై గాడ్ 2' సినిమాలతో బిజీగా ఉన్నాడు అక్షయ్ కుమార్.