Abn logo
May 23 2020 @ 23:58PM

మరోసారి!

ప్రేమలు, ఆప్యాయతలు, కుటుంబ అనుబంధాలే కథావస్తువులుగా కుటుంబమంతా కలిసి చూడదగ్గ హృద్యమైన చిత్రాలు తెరకెక్కించే దర్శకుడు శేఖర్‌ కమ్ముల. సాధారణంగా సినిమా సినిమాకి మధ్య విరామం తీసుకోవడం ఆయనకు అలవాటు. కానీ, ఈసారి ఓ సినిమా సెట్స్‌ మీద ఉండగా మరో సినిమాకు పచ్చజెండా ఊపారు.


శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై  నారాయణ దాస్‌ నారంగ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘లవ్‌ స్టోరీ’. దీని తర్వాత ఈ దర్శక, నిర్మాత జోడీ మరోసారి కలిసి పని చేయనున్నారు. ‘లవ్‌ స్టోరీ’ తీసేటప్పుడు శేఖర్‌ కమ్ముల పనితీరు నచ్చడంతో తమ సంస్థలో మరో సినిమా చేయమని నారాయణ దాస్‌ నారంగ్‌ అడగ్గానే... లాక్‌డౌన్‌లో మరో కథ సిద్ధం చేస్తున్న దర్శకుడు వెంటనే అంగీకరించారని తెలిసింది. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఈ చిత్రంలో స్టార్‌ హీరో నటిస్తారు. ఎవరనేది తర్వాత చెబుతాం. మరో 15 రోజులు చిత్రీకరణ చేస్తే ‘లవ్‌ స్టోరీ’ పూర్తవుతుంది. ఆ చిత్రం తర్వాత కొత్త చిత్రం ప్రారంభిస్తాం’’ అన్నారు.

Advertisement
Advertisement
Advertisement