వారానికోసారి

ABN , First Publish Date - 2022-04-18T04:52:01+05:30 IST

మండలంలోని ముద్దటమాగి గ్రామంలో నీటి సమస్య వేధిస్తోంది. పంచాయతీ అధికారులు వారం రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు.

వారానికోసారి
ముద్దటమాగి గ్రామంలో నీటి కోసం బారులుగా ఉంచిన బిందెలు

  ముద్దటమాగిలో తాగునీటి కటకట

హొళగుంద, ఏప్రిల్‌ 17: మండలంలోని ముద్దటమాగి గ్రామంలో నీటి సమస్య వేధిస్తోంది. పంచాయతీ అధికారులు వారం రోజులకోసారి నీటి సరఫరా చేస్తున్నారని గ్రామస్థులు వాపోతున్నారు. గుక్కెడు నీటి కోసం వ్యవసాయ బావుల వెంబడి పరుగులు పెడుతున్నారు. నీటి సమస్య తీర్చాలని అనేక సార్లు అధికారులను కోరినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 


Updated Date - 2022-04-18T04:52:01+05:30 IST