1,000 దాటేశాయి!

ABN , First Publish Date - 2022-01-21T05:24:31+05:30 IST

జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. గురువారం రికార్డు స్థాయిలో 1,039 కేసులు నమోదయ్యాయి. రెండో దశ దాటిన తరువాత ఇంతలా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇది కలవరపాటుకు గురిచేస్తోంది. నెలాఖరుకు కేసులు మరింతగా పెరిగే అవకాశముండడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. జనవరి ప్రారంభంలో ఏక సంఖ్యలో నమోదైన కేసులు..రెండో వారం నుంచి క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. కరోనా రెండు దశల్లో ఇప్పటివరకూ జిల్లాలో 86,590 మంది వైరస్‌బారిన పడ్డారు. వారిలో 83,099 మంది కోలుకున్నారు. 651 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 2,840 మంది చికిత్స పొందుతున్నారు. గురువారం రికార్డు స్థాయిలో 1035 మందికి వైరస్‌ నిర్థారణ అయ్యింది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రమాద ఘంటికలు మోగినట్టేనని యం

1,000 దాటేశాయి!

గురువారం ఒక్కరోజే 1,039 కేసుల నమోదు

రెండో దశ తరువాత ఇవే అత్యధికం

జనవరి ప్రారంభంలో అరకొరే

రెండో వారంలో క్రమేపీ పెరుగుదల

పండుగ తరువాత మారిన పరిస్థితి

యంత్రాంగం అప్రమత్తం

రింగురోడ్డు, జనవరి 20: జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. గురువారం రికార్డు స్థాయిలో 1,039 కేసులు నమోదయ్యాయి. రెండో దశ దాటిన తరువాత ఇంతలా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇది కలవరపాటుకు గురిచేస్తోంది. నెలాఖరుకు కేసులు మరింతగా పెరిగే అవకాశముండడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్యను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. జనవరి ప్రారంభంలో ఏక సంఖ్యలో నమోదైన కేసులు..రెండో వారం నుంచి క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి.  కరోనా రెండు దశల్లో ఇప్పటివరకూ జిల్లాలో 86,590 మంది వైరస్‌బారిన పడ్డారు. వారిలో 83,099 మంది కోలుకున్నారు. 651 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 2,840 మంది చికిత్స పొందుతున్నారు. గురువారం రికార్డు స్థాయిలో 1035 మందికి వైరస్‌ నిర్థారణ అయ్యింది.  ఇటీవల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రమాద ఘంటికలు మోగినట్టేనని యంత్రాంగం భావిస్తోంది. ప్రజలు నిబంధనలు పాటించకపోవడం   ఆందోళన కలిగిస్తోంది. సంక్రాంతి ముగిసింది. స్వగ్రామాలకు వచ్చిన వారు తిరుగుముఖం పడుతున్నారు.బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిటకిట లాడుతూ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రజ ల్లో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. యంత్రాం గం మూడో దశను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతోంది.

 కానరాని కంటైన్మెంట్‌ జోన్లు

జిల్లాలో కంటైన్మెంట్‌ జోన్‌లు ఎక్కడా కానరావడం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 70 కంటైన్మెంట్‌ జోన్లు కొనసాగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గతంలో ఎక్కడైనా పాజిటివ్‌ కేసు నమోదైతే.. కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటు చేసేవారు. పారిశుధ్య పనులు చేపట్టి.. అటు దిశగా రాకపోకలను నిషేధించేవారు. ప్రస్తుతం ఇవేవీ అమలుకావడం లేదు. పాఠశాలలు, థియేటర్లు, బస్సులు, ఆటోల్లో ఎక్కడా కొవిడ్‌ నిబంధనలు పాటి ంచడం లేదు. చాలామంది మాస్క్‌లు లేకుండా తిరిగేస్తు న్నారు. విజయనగరం, పార్వతీపురం, సాలూరు, బొబ్బిలి, చీపురుపల్లి, ఎస్‌.కోట, కొత్తవలసతో పాటు అన్ని ముఖ్య పట్టణాల్లోని వ్యాపార కూడళ్ల వద్ద నిత్యం జన సంచారం ఎక్కువగా ఉంటోంది. దీంతో వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒమైక్రాన్‌ కేసులు విదేశీయుల నుంచే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయని వైద్యులే చెబుతున్నారు. గతంలో జిల్లా సరిహద్దులో ప్రత్యేక చెక్‌పోస్టు ఏర్పాటుచేసి విదేశీయుల రాకపోకలపై నిఘా కొనసాగించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. విదేశీయలు స్వగ్రామాలకు వస్తే, వలంటీర్లు సమాచారం అందజేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని వలంటీర్లు, వైద్య ఉద్యోగులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలా అందరి నిర్లక్ష్యంతో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని.. వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. 


Updated Date - 2022-01-21T05:24:31+05:30 IST