వెబ్‌సైట్‌లో.. వైద్యుల మెరిట్‌ జాబితా

ABN , First Publish Date - 2021-01-19T05:50:49+05:30 IST

జిల్లాలోని పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో వైద్యాధికారుల పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి సాధారణ మెరిట్‌ లిస్టును అధికారులు సోమవారం విడుదల చేశారు.

వెబ్‌సైట్‌లో.. వైద్యుల మెరిట్‌ జాబితా

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి/గుజరాతీపేట, జనవరి 18 : జిల్లాలోని పట్టణ ఆరోగ్యకేంద్రాల్లో వైద్యాధికారుల పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి సాధారణ మెరిట్‌ లిస్టును అధికారులు సోమవారం విడుదల చేశారు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.శ్రీకాకుళం.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో మెరిట్‌లిస్టును అందుబాటులోకి తీసుకువచ్చామని డీఎంహెచ్‌వో చంద్రానాయక్‌ వెల్లడించారు. జాబితాపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 21 సాయంత్రం ఐదు గంటలలోగా తెలియజేయాలని సూచించారు. నేషనల్‌ హెల్త్‌మిషన్‌ విభాగంలో వైద్యాధికారులు, స్టాఫ్‌నర్సులు, ఇతర ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎంపిక జాబితాను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరిచామని చెప్పారు. డీఎంహెచ్‌వో కార్యాలయంలో ఈ నెల 20, 21 తేదీల్లో అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లను పరిశీలిస్తామని తెలిపారు. 

Updated Date - 2021-01-19T05:50:49+05:30 IST