ప్రియుడు మోసం చేశాడని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.. అక్కడ మరింత పెద్ద కష్టం ఎదురైంది.. విచారణ పేరుతో..

ABN , First Publish Date - 2021-12-24T21:50:04+05:30 IST

ఆమె ప్రియుడి చేతిలో మోసపోయింది.. హిందువునని అబద్ధం చెప్పి తనతో సహజీవనం చేశాడని తెలుసుకుంది.. అతడిపై ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.. అక్కడ ఓ కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ పేరుతో ఆమెను

ప్రియుడు మోసం చేశాడని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.. అక్కడ మరింత పెద్ద కష్టం ఎదురైంది.. విచారణ పేరుతో..

ఆమె ప్రియుడి చేతిలో మోసపోయింది.. హిందువునని అబద్ధం చెప్పి తనతో సహజీవనం చేశాడని తెలుసుకుంది.. అతడిపై ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.. అక్కడ ఓ కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ పేరుతో ఆమెను వెంబడించాడు.. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఆమెతో సంవత్సరం పాటు సహజీవనం చేశాడు.. ఇటీవల అసలు విషయం బయటపడడంతో బాధిత యువతి జిల్లా ఎస్పీని ఆశ్రయించింది.. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ ఘటన జరిగింది.


మొరాదాబాద్‌లో నర్సుగా పనిచేస్తున్న 23 ఏళ్ల యువతి మూడేళ్ల క్రితం ఇషాన్ అనే యువకుడితో ప్రేమలో పడింది. అతడితో సహజీవనం చేసింది. అయితే ఇషాన్ అసలు పేరు ఫైజాన్ అని, అతను ఓ ముస్లిం యువకుడని తెలియడంతో అతడికి దూరమైంది. అతడిపై ఫిర్యాదు చేసేందుకు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను ఇంటికి పంపేశారు. అయితే రాఘవేంద్ర సింగ్ అనే కానిస్టేబుల్ విచారణ పేరుతో తరచుగా యువతి ఇంటికి వెళ్లేవాడు. 2019 డిసెంబర్ 7వ తేదీ రాత్రి 10 గంటలకు కూడా విచారణ పేరుతో యువతి ఇంటికి వెళ్లాడు. 


యువతి ఒంటరిగా ఉండడంతో తుపాకీ చూపించి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని యువతి బెదిరించడంతో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. దీంతో అప్పట్నుంచి ఆ యువతి రాఘవేంద్రతో సహజీవనం చేస్తోంది. అయితే ఇటీవల రాఘవేంద్ర పర్సు చూసిన ఆమెకు షాక్ తగిలింది. రాఘవేంద్రకు అప్పటికే పెళ్లై, ఐదేళ్ల కొడుకు కూడా ఉన్నట్టు తెలిసింది. దీంతో ఆ యువతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే రాఘవేంద్రపై పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోలేదు. దీంతో ఆ యువతి జిల్లా ఎస్పీని ఆశ్రయించింది. ఎస్పీ ఆదేశాలతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. 


Updated Date - 2021-12-24T21:50:04+05:30 IST