బల్కంపేట బోనం కాంప్లెక్స్‌ ఆవరణలో ..రూ3.37 కోట్లతో మల్టీలెవల్‌ పార్కింగ్‌ :తలసాని

ABN , First Publish Date - 2020-10-20T07:34:35+05:30 IST

ఎంతో ప్రసిద్ధిగాంచిన బల్కంపేట ఎల్ల మ్మ ఆలయం బోనం కాంప్లెక్స్‌ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం రూ. 3.37 కోట్లతో మల్టీలెవల్‌ పార్కింగ్‌ పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

బల్కంపేట బోనం కాంప్లెక్స్‌ ఆవరణలో ..రూ3.37 కోట్లతో మల్టీలెవల్‌ పార్కింగ్‌ :తలసాని

అమీర్‌పేట, అక్టోబర్‌ 29 (ఆంధ్రజ్యోతి): ఎంతో ప్రసిద్ధిగాంచిన బల్కంపేట ఎల్ల మ్మ ఆలయం బోనం కాంప్లెక్స్‌ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం రూ. 3.37 కోట్లతో మల్టీలెవల్‌ పార్కింగ్‌ పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. సోమవారం మాసాబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, మెట్రోరైల్‌, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ బల్కంపేట ఎల్లమ్మ తల్లిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు సరైన పార్కింగ్‌ లేకపోవడంతో వాహనదారులు, ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆ సమస్య పరిష్కారం కోసం బోనం కాంప్లెక్స్‌ పక్కనే ఉన్న 527 గజాల స్థలంలో జీ ప్లస్‌ 2 విధానంలో మల్టీలెవల్‌ పార్కి ంగ్‌ చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. మొదట ఈ పనులను మెట్రో రై ల్‌ ఆధ్వర్యంలో చేపట్టాలని నిర్ణయించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ పనులను దేవాదాయశాఖ ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్‌ ఎస్‌సీ జ్యోతిర్మయి, ఈఈ సత్యనారాయణ రెడ్డి, సికింద్రాబాద్‌ ఆర్డీవో వసంత, మెట్రో రైల్‌ జీఎం రాజేశ్వర్‌రావు, ఈఈ ప్రసాద్‌, దేవాదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ రామకృష్ణ, అసిస్టెంట్‌ కమిషనర్‌ కృష్ణ బల్కంపేట ఎల్లమ్మ ఆలయ ఈవో అన్నపూర్ణ, తహసీల్దార్‌ చంద్రకళ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-20T07:34:35+05:30 IST