మహిళా దినోత్సవం రోజున ఘోరం.. వర్షం పడుతోందని చెట్టు కిందకు చేరిన బాలిక.. ఆ చిన్నారిని ఒంటరిగా చూసి..

ABN , First Publish Date - 2022-03-09T19:54:59+05:30 IST

మహిళా దినోత్సవం రోజున స్త్రీలను గౌరవిస్తూ ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. మరోవైపు ఆదే రోజున రాజస్థాన్‌లోని పాలికి సమీపంలో ఘోరం జరిగింది.

మహిళా దినోత్సవం రోజున ఘోరం.. వర్షం పడుతోందని చెట్టు కిందకు చేరిన బాలిక.. ఆ చిన్నారిని ఒంటరిగా చూసి..

మహిళా దినోత్సవం రోజున స్త్రీలను గౌరవిస్తూ ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. మరోవైపు ఆదే రోజున రాజస్థాన్‌లోని పాలికి సమీపంలో ఘోరం జరిగింది. అభం శుభం తెలియని ఓ బాలికపై మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. స్కూలు నుంచి వస్తుండగా వర్షం పడుతోందని ఆ 9 ఏళ్ల బాలిక ఓ చెట్టు కిందకు చేరింది. అక్కడ ఆ చిన్నారిని ఒంటరిగా చూసిన మృగాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ చిన్నారిని అక్కడే వదిలేసి పారిపోయాడు. కుటుంబ సభ్యులు ఆ చిన్నారి కోసం గాలించగా రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో కనిపించింది. 


రాజస్థాన్‌లోని పాలికి సమీపంలోని ఓ గ్రామంలో తొమ్మిదేళ్ల బాలిక మంగళవారం సాయంత్రం స్కూలు నుంచి ఇంటికి తిరిగి వెళ్తోంది. ఆ సమయంలో ఒక్కసారిగా వర్షం పడడంతో ఆమె సమీపంలోని ఓ చెట్టు కిందకు వెళ్లింది. ఆ సమయంలో బైక్ మీద వచ్చిన ఓ యువకుడు కూడా చెట్టు కింద ఆగాడు. ఒంటరిగా ఉన్న బాలికను చూసి ఆ చిన్నారిపై అత్యాచారానికి తెగబడ్డాడు. అనంతరం బైక్ మీద వెళ్లిపోయాడు. బాలిక ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు గాలించారు. 


రోడ్డు పక్కన తీవ్ర రక్తసావ్రంతో అపస్మారక స్థితిలో బాలిక కనిపించింది. వెంటనే ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 

Updated Date - 2022-03-09T19:54:59+05:30 IST