రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన చైర్మనపై చీటింగ్‌ కేసు నమోదు

ABN , First Publish Date - 2022-08-10T05:37:04+05:30 IST

రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన చైర్మన షేక్‌ కరీముల్లా అమీనపై సోమవారం నల్లచెరువు పోలీస్‌స్టేషనలో చీటింగ్‌ కేసు నమోదైంది.

రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన చైర్మనపై  చీటింగ్‌ కేసు నమోదు
బాధితుడు షేక్‌ అబ్దుల్‌ హుస్సేన


కదిరి, ఆగస్టు 9 : రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన చైర్మన షేక్‌ కరీముల్లా అమీనపై సోమవారం నల్లచెరువు పోలీస్‌స్టేషనలో చీటింగ్‌ కేసు నమోదైంది. ఈ కేసు వివరాలను ఎస్‌ఐ వరలక్ష్మి ఇలా తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషనలో అటెం డర్‌ ఉద్యోగం (అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా) ఇప్పిస్తానని నల్లచెరువుకు చెందిన షేక్‌ అబ్దుల్‌ హుస్సేన అనే వ్యక్తి నుంచి కడప టౌనకు చెందిన షేక్‌ కరీముల్లా రూ.3.80లక్షలు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని బాఽధితుడు 2021, డిసెంబర్‌ 31వ తేదీన షేక్‌ కరీముల్లా స్టేట్‌బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్‌39826368808కు నల్లచెరువులోని కోటక్‌ మహేంద్ర బ్యాంక్‌ నుంచి పంపాడు. అ తరువాత కరీముల్లాకు అతడు ఖర్చుల కింద రూ.20వేలు కూడా ఇచ్చాడు. ఇప్పటి వరకు ఉద్యోగం చూపకపోగా.. ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో ఈనెల 8న నల్లచెరువు పోలీస్‌ స్టేషన ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. బాఽధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఉద్యోగం ఇప్పిస్తానని మోసం - బాధితుడు షేక్‌ అబ్దుల్‌ హుస్సేన

నాకు రాష్ట్ర గిడ్డంగి కార్పొరేషన చైర్మన షేక్‌ కరీముల్లా గిడ్డంగి కార్పోరేషనలో అవుట్‌ సోర్సింగ్‌ ద్వారా అటెండర్‌ ఉద్యోగం  ఇప్పిస్తాన్నాడు. నాకు తెలిసిన వ్యక్తి చైర్మనను నాకు పరిచయం చేశాడు. ఉద్యోగం కోసం చైర్మన అకౌంట్‌కు రూ.3.80 లక్షలు వేశాను. ఖర్చుల కోసం మరో రూ.20 వేలు ఇచ్చాను. ఆరు నెలలు గడిచిన ఉద్యోగం ఇవ్వకపోవడంతో చైర్మనను నిలదీశాను. అయన నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. స్పందనలో కూడా ఫిర్యాదు చేశాను. ఫలితం లేకపోవడం తో పోలీసులకు ఫిర్యాదు చేశాను. నాలా చాల మంది బాధితులు వివిధ జిల్లాల్లో ఉన్నారు. నా డబ్బు నాకు ఇప్పించాలని  అధికారులను కోరుతున్నాను.   


Updated Date - 2022-08-10T05:37:04+05:30 IST