ఆగస్టు 5న ‘సీపెట్‌’

ABN , First Publish Date - 2020-07-05T08:02:20+05:30 IST

చర్లపల్లిలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌)లో వివిధ కోర్సులకు నిర్వహించే ప్రవేశ

ఆగస్టు 5న ‘సీపెట్‌’

కుషాయిగూడ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): చర్లపల్లిలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సీపెట్‌)లో వివిధ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్ష దరఖాస్తుకు ఈనెల 31 చివరి తేదీ అని సెంటర్‌ హెడ్‌ .కిరణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్షను ఆగస్టు 5న నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఈ సంస్థ కోర్సులకు డిమాండ్‌ అధికంగా ఉంటుంది. మూడేళ్ల వ్యవధిగల డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ టెక్నాలజీ(డీపీటీ), డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ మౌల్డ్‌ టెక్నాలజీ(డీపీఎంటీ) కోర్సుకు పదో తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా రెండేళ్ల వ్యవధితో నిర్వహించే పీజీ డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ టెస్టింగ్‌(పీజీడీపీపీటీ)కోర్సుకు బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అభ్యర్థులు  ఈమెయిల్‌  లేదా ఆన్‌లైన్‌ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు ఫోన్‌ 9952046851 నంబరులో సంప్రదించవచ్చు.

Updated Date - 2020-07-05T08:02:20+05:30 IST