Advertisement
Advertisement
Abn logo
Advertisement

14న మాదిగ విద్యార్థుల చలో ఢిల్లీ

రాజాం: ఎస్సీ వర్గీకరణ సాధించే దిశలో ఈనెల 14న మాదిగ విద్యార్థుల చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్‌ నాయకులు తెలిపారు. శనివారం స్థానిక మాదిగ వీధిలో ప్లెక్సీని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లోక్‌సభ శీతాకాల సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశ పెట్టాలని ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మాదిగ విద్యార్థులంతా పాల్గొని విజయవంతం చేయాలనికోరారు. కార్యక్రమంలో సంఘం నాయకులు నాయకులు వై.బుజ్జి. రవికుమార్‌, పి.లాజర్‌, వై.చినబాబు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement