రఖీబ్‌ షావలి దర్గా భూ కబ్జాలపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-20T04:46:47+05:30 IST

రాష్ట్రంలో మైనార్టీ లు, వారి పవిత్రమైన మసీదులు, దర్గాకు రక్ష ణ లేకుండా పోయిం ద ని రఖీబ్‌ షావలి దర్గా భూముల కబ్జాపై చర్య లు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌కు బహిరం గ లేఖ రాసినట్లు కాం గ్రెస్‌ మైనార్టీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు పఠాన్‌ మహమ్మద్‌ అలీఖాన్‌ తెలిపారు.

రఖీబ్‌ షావలి దర్గా భూ కబ్జాలపై  చర్యలు తీసుకోవాలి
సీఎంకు రాసిన లేఖను విడుదల చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు

ముఖ్యమంత్రికి కాంగ్రెస్‌ రాష్ట్ర మైనార్టీ నేతల లేఖ

కడప(కలెక్టరేట్‌) ఆగస్టు 19: రాష్ట్రంలో మైనార్టీ లు, వారి పవిత్రమైన మసీదులు, దర్గాకు రక్ష ణ లేకుండా పోయిం ద ని రఖీబ్‌ షావలి దర్గా భూముల కబ్జాపై చర్య లు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌కు బహిరం గ లేఖ రాసినట్లు కాం గ్రెస్‌ మైనార్టీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు పఠాన్‌ మహమ్మద్‌ అలీఖాన్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా కాం గ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ దర్గాకు చెందిన 5.75 ఎకరాల భూములు అధికార పార్టీ నేతల అనుచరులు, రెవెన్యూశాఖ అండదండలతో ఆక్రమణకు దిగారని ఆరోపించారు.

1860 నుంచి దర్గా అనుభవంలో ఉన్న  భూములను శ్రీరామకృష్ణ పాఠశాల యాజమాన్యం ఆక్రమించే ప్రయత్నంలో తహసీ ల్దారు సహకరిస్తున్నారని ఆరోపించారు. కడపలో దర్గా భూములు అన్యాక్రాంతమవుతున్నా మైనార్టీ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం అంజాద్‌బా షా భూ కబ్జా దారులకు రక్షణ కల్పించేవిధంగా మౌనం వహించడం దారుణమన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలనీ ముఖ్యమంత్రికి రాసి న బహిరంగ లేఖలో అలీఖాన్‌, రాష్ట్ర ఎస్సీసెల్‌ ఉపాధ్యక్షుడు విజయ భాస్కర్‌, రాష్ట్ర బీసీ సెల్‌ ఉపాధ్యక్షుడు నాగరాజు తదితరులున్నారు.

Updated Date - 2022-08-20T04:46:47+05:30 IST