Jun 14 2021 @ 02:00AM

పెదరాయుడు విడుదల తేదీన...

మోహన్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’. తొలి పాటను మంగళవారం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ రోజు ‘పెదరాయుడు’ విడుదల తేదీ కావడం గమనార్హం. ఈ సందర్బంగా మోహన్‌బాబు మాట్లాడుతూ ‘‘1995లో జూన్‌ 15న ‘పెదరాయుడు’ విడుదలైంది. ఇప్పుడు 26 సంవత్సరాల తర్వాత అదే రోజున ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’లో లిరికల్‌ వీడియో విడుదల కానుండటం శుభ సూచికంగా భావిస్తున్నాను. అప్పుడు ‘పెదరాయుడు’ చిత్రానికి నేను నిర్మాత అయితే... ఇప్పుడు ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’కు నా తనయుడు విష్ణు నిర్మాత కావడం సంతోషం. ఈ సినిమా కోసం 11వ శతాబ్దానికి చెందిన రఘువీర గద్యాన్ని ఇళయరాజా సంగీత సారధ్యంలో రాహుల్‌ నంబియార్‌ స్వరంతో లిరికల్‌ వీడియోగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ పాటను శ్రీరామునికి అంకితం ఇస్తున్నా’’ అన్నారు.