ముంబై: చెన్నై సూపర్ కింగ్స్‌తో కీలక మ్యాచ్‌కు ఢిల్లీ కేపిటల్స్ శిబిరంలో మరోమారు కొవిడ్ కలకలం రేగింది. ఆ జట్టు నెట్‌బౌలర్‌కు కరోనా (Corona) సోకినట్టు నిర్ధారణ అయింది. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ.. వైరస్ సోకిన ఆటగాడితో పాటు అతడితో రూమ్ షేర్ చేసుకుంటున్న మరో బౌలర్‌ను ఐసోలేషన్‌కు పంపింది. ఐపీఎల్ ప్రొటోకాల్ ప్రకారం ఢిల్లీ కేపటిల్స్ సభ్యులందరికీ మరో విడత పరీక్షలు చేస్తారు. అప్పటి వరకు ఆటగాళ్లందరూ తమ గదుల్లో ఐసోలేషన్‌లోనే ఉండాలి.
ఢిల్లీ కేపిటల్స్ ఈ సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో డీవై పాటిల్ స్టేడియంలో తలడనుంది. ఇప్పటి వరకు పది గేములు ఆడిన ఢిల్లీ ఐదు విజయాలతో ఐదో స్థానంలో ఉంది. గత నెలలో ఢిల్లీ విదేశీ ఆటగాళ్లు టిమ్ సీఫెర్ట్, మిచెల్ మార్ష్‌తోపాటు నలుగురు సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఫలితంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ వేదికిను పూణె నుంచి ముంబైకి మార్చాల్సి వచ్చింది. ఇప్పుడు మరోమారు ఆ జట్టు సభ్యుడు కరోనా బారినపడ్డాడు.
ఇవి కూడా చదవండి