ఆన్‌లైన్‌ మోసం

ABN , First Publish Date - 2021-01-27T06:18:32+05:30 IST

రిపబ్లిక్‌ డే ఆఫర్‌ ఉండడంతో ఆన్‌లైన్‌లో రూ.49,900కు సెల్‌ ఫోన్‌ బుక్‌ చేసుకున్నాడు. ఓ కంపెనీ ద్వారా వచ్చిన బాక్స్‌ను డబ్బులు చెల్లించి తీసుకున్నాడు.

ఆన్‌లైన్‌ మోసం

  1. రూ. 50 వేలకు పగిలిన సెల్‌ఫోన్‌, కొళాయి ఎల్‌ 


 కోవెలకుంట్ల, జనవరి 26: రిపబ్లిక్‌ డే ఆఫర్‌ ఉండడంతో ఆన్‌లైన్‌లో రూ.49,900కు సెల్‌ ఫోన్‌ బుక్‌ చేసుకున్నాడు. ఓ కంపెనీ ద్వారా వచ్చిన బాక్స్‌ను డబ్బులు చెల్లించి తీసుకున్నాడు.  ఓపెన్‌ చేసి చూడగా కొత్త సెల్‌ఫోన్‌కు బదులు పగిలిపోయిన సెల్‌ఫోన్‌, కొళాయికి వాడే ఎల్‌ ఉన్నాయి. ఈ సంఘటన కోవెలకుంట్లలో మంగళవారం జరిగింది. కోవెలకుంట్ల పట్టణంలోని సర్కిల్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఉన్న ప్రసాద్‌ సెల్‌పాయింట్‌లో దస్తగిరి అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఓ ప్రముఖ కంపెనీ సెల్‌ఫోన్‌ ధర రూ.52,500 కాగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా రూ.49,900కు ఇస్తామని ఆఫర్‌ ప్రకటించారు. దీంతో ఈ నెల 22న సెల్‌ఫోన్‌ ద్వారా దస్తగిరి ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్నాడు. హర్యానా నుంచి వచ్చిన సెల్‌ఫోన్‌ బాక్స్‌ను 25వ తేదీ కోవెలకుంట్లలో డబ్బులు చెల్లించి తీసుకున్నాడు. 26వ తేదీన బాక్స్‌ ఓపెన్‌ చేసి చూడగా అందులో పగిలిపోయిన సెల్‌ఫోన్‌, కొళాయికి వాడే ఎల్‌ కనిపించాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 

Updated Date - 2021-01-27T06:18:32+05:30 IST