అయినా... అంత ఘోరంగా లేదు... ద్రవ్యోల్బణంపై నిర్మలా సీతారామన్

ABN , First Publish Date - 2022-04-20T23:52:08+05:30 IST

పెరుగుతున్న ధరలతో భారత్ అల్లాడుతున్నప్పటికీ... ద్రవ్యోల్బణం 'అంత ఘోరంగా' లక్ష్యాన్ని ఉల్లంఘించలేదని ఆర్ధిక శాఖా మంత్రి సీతారామన్ పేర్కొన్నారు.

అయినా... అంత ఘోరంగా లేదు...  ద్రవ్యోల్బణంపై నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ : పెరుగుతున్న ధరలతో భారత్ అల్లాడుతున్నప్పటికీ... ద్రవ్యోల్బణం 'అంత ఘోరంగా' లక్ష్యాన్ని ఉల్లంఘించలేదని ఆర్ధిక శాఖా మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. భౌగౌళిక, రాజకీయ పోరాటాలు, సరఫరా గొలుసు అంతరాయాలు వంటి ప్రపంచ సవాళ్ల మధ్య పెరుగుతున్న ధరలతో దేశం అల్లాడుతున్నప్పటికీ భారతదేశంలో ద్రవ్యోల్బణం 'అంత ఘోరంగా' ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... ‘ఏమైనప్పటికీ... ఈ రోజు భారతదేశ ద్రవ్యోల్బణం గత నెలలో 6.9 % వద్ద ఉంది. మా టాలరెన్స్ బ్యాండ్ 4 % మాత్రమే ప్లస్ లేదా మైనస్ 2 %. కాబట్టి 6 % వరకు వెళ్లవచ్చు. కాగా... మేం దానిని అంత ఘోరంగా ఉల్లంఘించలేదు’ఈ అని ఆమె పేర్కొన్నారు. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ డేటా ప్రకారం ఫిబ్రవరిలో 6.07 % ఉన్న హెడ్‌లైన్ సీపీఐ... మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయి(6.95 %)కి పెరిగింది. హెడ్‌లైన్ రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పుడు వరుసగా మూడు నెలల పాటు ద్రవ్య విధాన కమిటీ(ఎంపీసీ) యొక్క ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని మించిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ధరల ద్రవ్యోల్బణం మార్చి 2021 లో 3.94 % నుండి 2022 మార్చిలో 8.04 %కి రెండింతలు పెరిగింది’.

Updated Date - 2022-04-20T23:52:08+05:30 IST