స్వాతంత్ర్య వేడుకల ప్రత్యేక అతిథులుగా భారత ఒలంపిక్ క్రీడాకారులు

ABN , First Publish Date - 2021-08-03T21:26:22+05:30 IST

ఎర్రకోట వద్ద వద్ద ఈనెల 15న జరిగే స్వాతంత్ర్య వేడుకలు ఈసారి మరింత ప్రత్యేకతను..

స్వాతంత్ర్య వేడుకల ప్రత్యేక అతిథులుగా భారత ఒలంపిక్ క్రీడాకారులు

న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద వద్ద ఈనెల 15న జరిగే స్వాతంత్ర్య వేడుకలు ఈసారి మరింత ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి. భారతదేశం తరఫున ఒలంపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులందరినీ ఈ వేడుకలకు ప్రత్యేక అతిథిలుగా ప్రధాని మోదీ ఆహ్వానించనున్నారు. దీనికి తోడు ఒలంపిక్ క్రీడాకారులందరితో తన నివాసంలో ప్రధాని ముఖాముఖీ సంభాషించనున్నారు.


కాగా, టోక్యోలో జరుగుతున్న ఒలంపిక్స్‌లో పాల్గొంటున్న క్రీడాకారులను ప్రధాని మంగళవారం ఒక ట్వీట్‌లో అభినందించారు. ఈసారి ఇండియా నుంచి  ఎక్కువ మంది ఒలంపిక్స్ క్రీడల్లో క్వాలిఫై కావడంపై కూడా ప్రశంసలు కురిపించారు. గుజరాత్‌లో ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన లబ్ధిదారులతో జరిపిన వర్చువల్ సమావేశంలోనూ ఒలంపిక్ క్రీడాకారుల ప్రతిభను ఆయన ప్రస్తావించారు. వందేళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరుగని అతిపెద్ద విపత్తును చవిచూసినప్పటికీ చెక్కుచెదరని క్రీడా స్ఫూర్తి కనబరుస్తున్నారని ఒలంపిక్స్ కంటింజెంట్‌ను అభినందించారు. ఎక్కువ మంది క్వాలిఫై కావడమే కాకుండా గట్టి పోటీ కూడా ఇచ్చారని మోదీ పేర్కొన్నారు.

Updated Date - 2021-08-03T21:26:22+05:30 IST