నిన్న సొరంగం కూలిన చోటే నేడు మరో ప్రమాదం.. కెమెరాలో రికార్డ్..

ABN , First Publish Date - 2022-05-21T02:50:28+05:30 IST

శ్రీనగర్ : గురువారం రాత్రి(నిన్న) జమ్ముకాశ్మీర్‌ రంబాన్ జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న సొరంగంలో కొంతభాగం కూలిన చోట శుక్రవారం(నేడు) మరో ప్రమాదం సంభవించింది.

నిన్న సొరంగం కూలిన చోటే నేడు మరో ప్రమాదం.. కెమెరాలో రికార్డ్..

శ్రీనగర్ : గురువారం రాత్రి(నిన్న) జమ్ముకాశ్మీర్‌ రంబాన్ జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న సొరంగం కొంతభాగం కూలిన ఘటనా స్థలంలోనే శుక్రవారం(నేడు) మరో ప్రమాదం సంభవించింది. నేషనల్ హైవేపై మెకర్‌కోటె ప్రాంతంలో పర్వత గుహలు ఒక్కసారిగా కుప్పకూలాయి. పర్వతంలో కొంతభాగం విరిగిపడింది. దీంతో గురువారం నుంచి కొనసాగిన సొరంగ ప్రమాదం రెస్క్యూ ఆపరేషన్ కార్యకలాపాలు వృథాగా పోయాయి. ఇలాంటి మరో ప్రమాదం జరుగుతుందని ఏమాత్రం ఊహించలేదని రంబాన్ డిప్యూటీ కమిషనర్ మస్సారతుల్ ఇస్లాం అన్నారు. ప్రమాదంలో 2 యంత్రాలు ఇరుక్కుపోయాయి. తీవ్రమైన గాలి తుపాను కారణంగా రెస్క్యూ ఆపరేషన్ 16-17 గంటలపాటు కొనసాగింది. కానీ పర్వత సొరంగం కుప్పకూలడంతో శ్రమంతా వృథా అయ్యిందని ఆయన చెప్పారు. కాగా గురువారం జరిగిన ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోగా.. మరో 9 మంది శిథిలాల కింద  చిక్కుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నప్పటికీ వీరు ప్రాణాలతో బటయపడే అవకాశాలు తక్కువగా ఉంటాయని అధికారి చెప్పారు. కాగా గురువారం నిర్మాణదశలో ఉన్న సొరంగంలో కొంతభాగం కూలిన ఘటన, శుక్రవారం జరిగిన ప్రమాదాలు కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

Updated Date - 2022-05-21T02:50:28+05:30 IST