ఆ కరణ్ జోహర్ చిత్రం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన బాలీవుడ్ తార!

తార సుతారియా... ప్రస్తుతం బాలీవుడ్‌లోని యంగ్ ప్రామిసింగ్ బ్యూటీస్‌లో మొదటి వరుసలో ఉండే పేరు. అయితే, ఈమె ఎంట్రీ ఇచ్చింది అలాంటి ఇలాంటి సినిమాతో కాదు. కరణ్ జోహర్ నిర్మాణంలో ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ మూవీతో తారా పథంలోకి దూసుకొచ్చింది తార! కానీ, ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’తో ఆలియా భట్ ఓవర్ నైట్ స్టార్‌గా మారినట్టు... సీక్వెల్‌తో తారా టాప్ బ్యూటీ అవ్వలేకపోయింది! అదే అసంతృప్తి ఇప్పటికీ ఉందట ‘తడప్’ సుందరిలో... 


సునీల్ శెట్టి తనయుడు అహాన్ శెట్టి తొలి చిత్రం ‘తడప్’లో హీరోయిన్‌గా నటించింది తార. మన ‘ఆర్‌ఎక్స్ 100’ మూవీకి హిందీ రీమేకే ‘తడప్’. ఆల్రెడీ ట్రైలర్‌లో సూపర్ హాట్ సీన్స్‌తో మెస్మరైజ్ చేసిన తారా సుతారియా తన ఫస్ట్ మూవీ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుంది. ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2’ భారీ అంచనాల మధ్య విడుదలైంది. తారాతో పాటూ అనన్య పాండేకి కూడా అదే లాంచింగ్ మూవీ. కానీ, రిలీజ్ తరువాత మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. తారకి ఆశించినంత క్రేజ్ రాలేదు. కానీ, తరువాత ఆపర్లు మాత్రం వెంటవెంటనే వచ్చాయి. ప్రస్తుతం ఆమె మంచి డిమాండ్‌లోనే ఉంది... 


డెబ్యూ మూవీ సూపర్ హిట్ అవ్వకుండా, మెల్లగా వచ్చి చల్లాగా జారుకోవటం... మంచి పాఠమే నేర్పిందని తారా చెబుతోంది. కాస్త నిరుత్సాహపడినప్పటికీ తామంతా ఏ సినిమా ఆడుతుంది, ఏది ఆడదు అనే విషయం తెలుసుకోగలిగామని వివరించింది. అలాగే, ప్రస్తుతం సినిమాలు చూస్తోన్న ఆడియన్స్ బాగా తెలివైన వారనీ, తమకు ఏమీ కావాలో వారికి బాగా తెలుసుననీ తారా అంటోంది... 

Advertisement