అమెజాన్‌లో...‘ఎ కాల్‌ టూ స్పై’

ABN , First Publish Date - 2020-12-06T05:30:00+05:30 IST

అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం ‘ఎ కాల్‌ టూ స్పై’ ఇండియాలో డిసెంబర్‌ 11న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలవుతోంది.

అమెజాన్‌లో...‘ఎ కాల్‌ టూ స్పై’

అంతర్జాతీయంగా విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రం ‘ఎ కాల్‌ టూ స్పై’ ఇండియాలో డిసెంబర్‌ 11న అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలవుతోంది. రాధికా ఆప్టే, సారా మేఘన్‌ థామస్‌, స్టానా కాటిక్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంతో రాధిక ఆప్టే అంతర్జాతీయ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఇందులో ఆమె నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌ పాత్రలో నటించారు. ఇప్పటికే పలు దేశాల్లో  విడుదలైన ఈ చిత్రం ప్రశంసలు దక్కించుకుంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన వాస్తవిక సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముగ్గురు మహిళా గూఢచారులు నాజీల దళాల్లోకి చొరబడి కీలక సమాచారాన్ని సేకరించే సంఘటనలను ఉత్కంఠగా తెరకెక్కించారు. లైడియా డీన్‌ పిల్చర్‌ దర్శకత్వం వహించారు.

Updated Date - 2020-12-06T05:30:00+05:30 IST