ఖతార్‌ ఖాతాలో రెండో విజయం

ABN , First Publish Date - 2022-06-25T10:23:01+05:30 IST

ఆసియా పురుషుల క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో అల్‌-అరబీ (ఖతార్‌) క్లబ్‌ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది.

ఖతార్‌ ఖాతాలో  రెండో విజయం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆసియా పురుషుల క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షి్‌పలో అల్‌-అరబీ (ఖతార్‌) క్లబ్‌ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో శుక్రవారం ముగిసిన మూడో రోజు పోటీల్లో భారత్‌కు చెందిన టీస్పోర్ట్స్‌ క్లబ్‌పై అల్‌-అరబీ 38-19తో గెలుపొందింది. 11 గోల్స్‌తో చెలరేగిన లరిబి (కువైట్‌)కి బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డును జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు బహూకరించారు. అంతకుముందు అల్‌-ఖద్సియా (కువైట్‌) క్లబ్‌- అల్‌-నూర్‌ (సౌదీ అరేబియా) క్లబ్‌ మధ్య జరిగిన మరో మ్యాచ్‌ 29-29తో టైగా ముగిసింది.

Updated Date - 2022-06-25T10:23:01+05:30 IST