Abn logo
Mar 6 2021 @ 01:08AM

ఏపీ, తెలంగాణల్లో ఒమ్రాన్‌ ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హెల్త్‌కేర్‌ రంగంలో రక్తపోటు పరీక్ష పరికరాలు వంటి ఎక్వి్‌పమెంట్‌ను విక్రయిస్తున్న ఒమ్రాన్‌ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్‌లో తన మూడో ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇటువంటి ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ఒమ్రాన్‌ హెల్త్‌కేర్‌ ఇండియా ఎండీ మసనోరి మాత్సుబరా తెలిపారు. తెలంగాణల్లో మొత్తం 700 ఫార్మసీ అవుట్‌లెట్లలో తమ ఉత్పత్తులు లభ్యమవుతున్నాయని.. దీన్ని 1000కి పెంచుకోవాలని భావిస్తున్నామని చెప్పారు. భారత్‌లో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉందని.. యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి హైదరాబాద్‌ను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.  

Advertisement
Advertisement
Advertisement