Singapore: బూస్టర్ డోస్ తీసుకున్న ఇద్దరికి ఒమైక్రాన్ వేరియంట్

ABN , First Publish Date - 2021-12-10T15:16:20+05:30 IST

కొవిడ్-19 బూస్టర్ డోస్ వేయించుకున్న తర్వాత కూడా ఇద్దరు సింగపూర్ నివాసితులకు కరోనా ఒమైక్రాన్ వేరియంట్‌ సోకింది....

Singapore: బూస్టర్ డోస్ తీసుకున్న ఇద్దరికి ఒమైక్రాన్ వేరియంట్

సింగపూర్: కొవిడ్-19 బూస్టర్ డోస్ వేయించుకున్న తర్వాత కూడా ఇద్దరు సింగపూర్ నివాసితులకు కరోనా ఒమైక్రాన్ వేరియంట్‌ సోకింది. సింగపూర్ దేశంలో ఎయిర్‌పోర్ట్ ప్యాసింజర్-సర్వీస్ వర్కర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల మహిళకు ఒమైక్రాన్‌ సోకినట్లు కరోనా పరీక్షల్లో వెల్లడైంది.సింగపూర్ దేశంలో వెలుగుచూసిన ఒమైక్రాన్ వేరియంట్ మొదటి కేసు అని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జర్మనీ నుంచి సింగపూర్ దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఓ ప్రయాణికుడికి ఒమైక్రాన్ వేరియంట్ సోకింది. ఒమైక్రాన్ వేరియెంట్ కరోనా సోకిన ఇద్దరికీ మూడవ డోస్ వ్యాక్సిన్‌ వేయించుకున్నారని సింగపూర్ మంత్రిత్వ శాఖ తెలిపింది.ఈ వారం ప్రారంభంలో ఫైజర్ ఇంక్, బయోఎన్‌టెక్ ఎస్‌ఇలు ఒమైక్రాన్ వేరియంట్‌ను తటస్థీకరించడానికి కొవిడ్ -19 వ్యాక్సిన్‌లో మూడవ డోస్ అవసరమని ల్యాబ్ అధ్యయనాలు వెల్లడించాయి.




సింగపూర్ దేశంలోని నేషనల్ సెంటర్ ఫర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌లో ఒమైక్రాన్ వేరియెంట్ సోకిన ఇద్దరు వ్యక్తులు కోలుకుంటున్నారని, వారితో కాంటాక్ట్ ఉన్న వారిని కూడా 10 రోజులపాటు నిర్బంధంలో ఉంచామని సింగపూర్ మంత్రిత్వ శాఖ తెలిపింది.సింగపూర్‌లో గత నెలలో కరోనా కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. అర్హులైన వారిలో 96శాతం మందికి పూర్తిగా టీకాలు వేశారు. ఎక్కువ మంది సింగపూర్ ప్రజలు ఫైజర్ లేదా మోడెర్నాటీకాలు వేయించుకున్నారు. 29శాతం మంది బూస్టర్ డోసులను కూడా పొందారు. 5-11 ఏళ్ల వయసు వారికి కూడా త్వరలో కొవిడ్ టీకాలు వేయనున్నట్లు సింగపూర్ ప్రభుత్వ అధికారులు తెలిపారు.


Updated Date - 2021-12-10T15:16:20+05:30 IST