ఉత్తరాదిని వణికిస్తున్న cold waves...పెరుగుతున్న ఒమైక్రాన్ కేసులు

ABN , First Publish Date - 2021-12-20T14:23:08+05:30 IST

ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో కొవిడ్ ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య పెరుగుతోంది....

ఉత్తరాదిని వణికిస్తున్న cold waves...పెరుగుతున్న ఒమైక్రాన్ కేసులు

న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో కొవిడ్ ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒకవైపు వీస్తున్న చలిగాలులు వణికిస్తుండగా,మరో వైపు పెరుగుతున్న ఒమైక్రాన్ కేసులు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి.ఉత్తర భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో గత వారం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పలు రాష్ట్రాల్లో చలిగాలులు వీస్తున్నాయి.దీంతో భారతదేశంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య 153కి చేరుకున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో కొవిడ్-19 వేరియంట్ కేసులు పెరిగాయి.మహారాష్ట్రలో ఆరుగురు వ్యక్తులు ఒమైక్రాన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. గుజరాత్‌లో నలుగురికి ఒమైక్రాన్ వేరియెంట్ సోకినట్లు గుర్తించారు.


భారతదేశంలో ఇప్పటివరకు 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన మహారాష్ట్ర (54), ఢిల్లీ (22), రాజస్థాన్ (17) కర్ణాటక (14), తెలంగాణ (20), గుజరాత్ (11), కేరళ (11), ఆంధ్రాలో ఒమైక్రాన్ కేసులను గుర్తించింది. చండీగఢ్ (1), తమిళనాడు (1) పశ్చిమ బెంగాల్ (1) కేసులు నమోదైనాయి.దేశంలోనే తొలి రెండు కేసులు డిసెంబర్ 2న కర్ణాటకలో నమోదయ్యాయి.ఒమైక్రాన్ వేరియెంట్ 89 దేశాలకు విస్తరించింది.మరో మూడు రోజుల్లో ప్రపంచంలో ఒమైక్రాన్ కేసుల సంఖ్య రెట్టింపు అవుతుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఒమైక్రాన్ కట్టడి కోసం నెదర్లాండు దేశంలో ఆదివారం లాక్ డౌన్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, బూస్టర్ డోస్ వేసుకోవాలని వైట్ హౌస్ వైద్యసలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ సూచించారు.


Updated Date - 2021-12-20T14:23:08+05:30 IST