ఒమైక్రాన్‌ వల్ల ప్రాణభయం లేదు: harish rao

ABN , First Publish Date - 2021-12-15T18:09:26+05:30 IST

ఒమైక్రాన్‌ వేరియంట్‌ వల్ల ప్రాణభయం లేదని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు

ఒమైక్రాన్‌ వల్ల ప్రాణభయం లేదు: harish rao

హైదరాబాద్: ఒమైక్రాన్‌ వేరియంట్‌ వల్ల ప్రాణభయం లేదని మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌‌తో ప్రజలు ఆందోళన చెందొద్దని.. జాగ్రత్తలు పాటించాలని కోరారు. విదేశాల నుంచి వచ్చినవారి కాంటాక్ట్‌ ట్రేస్‌ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణలో కరోనా పరీక్షలు కూడా పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. అందరూ తప్పకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఫస్ట్‌డోస్‌ వ్యాక్సినేషన్‌ 98 శాతం పూర్తైందని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలో 2 డోసుల వ్యాక్సినేషన్‌ కూడా 64 శాతం పూర్తైనట్లు వివరించారు. బూస్టర్‌ డోస్‌ కోసం కేంద్రాన్ని కోరామన్నారు. ముందస్తుగా 21 లక్షల ఐసోలేషన్‌ కిట్లు సిద్ధం చేశామని పేర్కొన్నారు. తెలంగాణలో 25,390 పడకలకు ఆక్సిజన్‌ సౌకర్యం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే అన్ని ఆస్పత్రుల్లో బెడ్స్‌ను ఆక్సిజన్‌ బెడ్స్‌గా మార్చినట్లు వెల్లడించారు. ప్రజలంతా మాస్కులు.. భౌతికదూరం పాటించాలని మంత్రి హరీష్‌రావు విన్నవించారు.

Updated Date - 2021-12-15T18:09:26+05:30 IST