గర్భిణులకు ఒమైక్రాన్‌తో రిస్క్ ఎక్కువ!

ABN , First Publish Date - 2022-01-18T16:09:43+05:30 IST

ఒమైక్రాన్‌ రిస్క్‌ గర్భిణులకు ఎక్కువే! అయితే వ్యాక్సిన్‌ వేయించుకోవడం ద్వారా ఒమైక్రాన్‌తో కలిగే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. వాక్సిన్‌ వేయించుకోవడంతో పాటు ఈ పాండమిక్‌ సమయంలో గర్భిణులు తీసుకోవలసిన రక్షణ చర్యలు ఇవే!

గర్భిణులకు ఒమైక్రాన్‌తో రిస్క్ ఎక్కువ!

ఆంధ్రజ్యోతి(18-01-2022)

ఒమైక్రాన్‌ రిస్క్‌ గర్భిణులకు ఎక్కువే! అయితే వ్యాక్సిన్‌ వేయించుకోవడం ద్వారా ఒమైక్రాన్‌తో కలిగే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. వాక్సిన్‌ వేయించుకోవడంతో పాటు ఈ పాండమిక్‌ సమయంలో గర్భిణులు తీసుకోవలసిన రక్షణ చర్యలు ఇవే!

ఆహారం, నిద్ర: గర్భంతో ఇమ్యూనిటీ తగ్గుతుంది. కాబట్టి ఇమ్యూనిటీని పెంచే పోషకాహారం తీసుకోవాలి. జంక్‌, నూనెతో కూడిన పదార్థాలు, వేపుళ్లు తినకూడదు. ప్రాసెస్‌ చేసినవి, రెడీమేడ్‌గా వండుకోదగినవి తినకూడదు. ఎక్కువ సమయం పాటు విశ్రాంతిలో ఉంటూ, నిద్ర 8 గంటలకు తగ్గకుండా చూసుకోవాలి.

శ్వాస వ్యాయామాలు: ఒమైక్రాన్‌ నుంచి రక్షణ కోసం శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలి. ఇందుకోసం యోగా, ధ్యానం సాధన చేయవచ్చు. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం శ్వాస వ్యాయామాలు సాధన చేయాలి.

ఇంట్లో రక్ష: జనసమ్మర్థ ప్రదేశాలకు వెళ్లకుండా, ఇళ్లకే పరిమితమవడం ఉత్తమం. ఇంటికొచ్చే అతిధులు, పరిచయస్తుల సంఖ్యను తగ్గించాలి.

కొవిడ్‌ సోకితే: సెల్ఫ్‌ క్వారంటైన్‌ చేసుకుని, వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి. టెంపరేచర్‌, ఆక్సిజన్‌ లెవల్స్‌ పరీక్షించుకుంటూ ఉండాలి. కేర్‌ గివర్‌ వ్యాక్సిన్లు వేయించుకుని ఉండాలి.

Updated Date - 2022-01-18T16:09:43+05:30 IST