ఒమైక్రాన్ ఎఫెక్ట్.. ఫిబ్రవరిలో థర్డ్ వేవ్: కొవిడ్ సూపర్ మోడల్ ప్యానల్

ABN , First Publish Date - 2021-12-19T01:06:18+05:30 IST

దేశంలో ఫిబ్రవరి నాటికి ధర్డ్ వేవ్ తాకడం ఖాయమని కొవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ అంచనా

ఒమైక్రాన్ ఎఫెక్ట్.. ఫిబ్రవరిలో థర్డ్ వేవ్: కొవిడ్ సూపర్ మోడల్ ప్యానల్

న్యూఢిల్లీ: దేశంలో ఫిబ్రవరి నాటికి ధర్డ్ వేవ్ తాకడం ఖాయమని కొవిడ్-19 సూపర్ మోడల్ కమిటీ అంచనా వేసింది. ప్రస్తుతం రోజువారీ కేసుల లోడు దాదాపు 7,500గా ఉందని, ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని కమిటీ పేర్కొంది. ఇండియాలో ఒమైక్రాన్ థర్డ్ వేవ్ ఖాయమని పేర్కొన్న కమిటీ హెడ్ విద్యాసాగర్.. అయితే, అది సెకండ్ వేవ్ అంత ఉద్ధృతంగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు.


వచ్చే ఏడాది మొదట్లో థర్డ్ వేవ్ దేశాన్ని తాకే అవకాశం ఉందని విద్యాసాగర్ పేర్కొన్నారు. దేశంలో వ్యాక్సినేషన్ పెద్ద ఎత్తున జరగడంతో ఇమ్యూనిటీ పెరిగిందని, ఫలితంగా సెకండ్ వేవ్ అంత ఉద్ధృతంగా థర్డ్ వేవ్ ఉండే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. అయితే, థర్డ్ వేవ్ మాత్రం పక్కా అని స్పష్టం చేశారు. ప్రస్తుతం రోజుకు సుమారుగా 7500 కేసులు నమోదవుతున్నాయని, ఒమైక్రాన్ కారణంగా ఈ లెక్కలు మారిపోయే అవకాశం ఉందన్నారు. 


హైదరాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రొఫెసర్ అయిన విద్యాసాగర్ ‘ఏఎన్ఐ’తో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సెకండ్ వేవ్‌లో నమోదైనట్టుగా థర్డ్‌వేవ్‌లో అంత భారీగా రోజువారీ కేసులు నమోదయ్యే అవకాశం మాత్రం లేదని తేల్చి చెప్పారు.

Updated Date - 2021-12-19T01:06:18+05:30 IST