ఒమైక్రాన్ కారణంగా హెర్డ్ ఇమ్యూనిటీ.. ఇజ్రాయెల్ అంచనా..

ABN , First Publish Date - 2022-01-03T03:03:30+05:30 IST

ఇజ్రాయెల్‌లో అనేక మంది ఒమైక్రాన్ వేరియంట్ బారిన పడుతున్న కారణంగా దేశంలో ఈ వేరియంట్ కారణంగా హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉందని ఆదేశ వైద్య శాఖ అత్యున్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

ఒమైక్రాన్ కారణంగా హెర్డ్ ఇమ్యూనిటీ.. ఇజ్రాయెల్ అంచనా..

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్‌లో అనేక మంది ఒమైక్రాన్ వేరియంట్ బారిన పడుతున్న కారణంగా దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చే అవకాశం ఉందని ఆదేశ వైద్య శాఖ అత్యున్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఓ సమాజంలో మెజారిటీ ప్రజలకు ఓ వైరస్‌ను ఎదుర్కొనే సామర్థ్యంలో ఉంటే దాన్ని శాస్త్రపరిభాషలో హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. ఇది టీకాల ద్వారా లేదా.. అత్యధిక సంఖ్యలో ప్రజలు వైరస్ బారినపడి కోలుకోవటం వల్ల గానీ జరుగుతుంది. అయితే..  హెర్డ్ ఇమ్యూనిటీ టీకాల వల్లే రావాలని తాము కోరుకుంటున్నట్టు సదరు అధికారి పేర్కొన్నారు. రాబోయే వారాల్లో ఇజ్రాయెల్‌లో ఒమైక్రాన్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు.  


Updated Date - 2022-01-03T03:03:30+05:30 IST