హైదరాబాద్‌లో మరో వ్యక్తికి ఒమైక్రాన్‌

ABN , First Publish Date - 2021-12-22T21:03:38+05:30 IST

హైదరాబాద్‌లో మరో వ్యక్తికి ఒమైక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. కెన్యా నుంచి హైదరాబాద్‌ వచ్చిన వ్యక్తికి ఒమైక్రాన్‌ వైరస్ సోకింది.

హైదరాబాద్‌లో మరో వ్యక్తికి ఒమైక్రాన్‌

హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో వ్యక్తికి ఒమైక్రాన్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. కెన్యా నుంచి హైదరాబాద్‌ వచ్చిన వ్యక్తికి ఒమైక్రాన్‌ వైరస్ సోకింది. హయత్‌నగర్‌లో ఉన్న బాధితుడిని వైద్యులు టిమ్స్‌కు తరలించారు. బాధితుడి కాంటాక్ట్‌లను గుర్తించి వైద్యులు టెస్టులు చేస్తున్నారు. ఈ రోజు నమోదైన కేసుతో కలిసి రాష్ట్రంలో ఒమైక్రాన్ బాధితుల సంఖ్య 25కు చేరింది. మంగళవారం విదేశాల నుంచి 726 మంది రాష్ట్రానికి వచ్చారు. వీరిలో ముగ్గురికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. నమూనాలను జన్యు విశ్లేషణకు పంపారు. ఇప్పటివరకు ముప్పు జాబితాలోని దేశాల నుంచి వచ్చినవారిలో 59 మందికి కొవిడ్‌ నిర్ధారణ కాగా.. 13 మంది జన్యు విశ్లేషణ రిపోర్టులు రావాల్సి ఉంది. కాగా, హైదరాబాద్‌ ఆస్పత్రి వైద్యుడికి.. చికిత్స కోసం వచ్చిన సోమాలియా వ్యక్తి నుంచి ఒమైక్రాన్‌ సోకింది. అనంతరం ఈ వైద్యుడు 90 మంది రోగులకు చికిత్స చేశారు. వీరి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. ఆస్పత్రిలోని ఆయన కాంటాక్టులందరినీ క్వారంటైన్‌కు పంపారు.  

Updated Date - 2021-12-22T21:03:38+05:30 IST