ఒమైక్రాన్‌ లక్ష్యంగా ప్రత్యేక వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2022-02-08T06:58:34+05:30 IST

కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌పై పనిచేయగల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా మరో అడుగు ముందుకు వేయనుంది..

ఒమైక్రాన్‌ లక్ష్యంగా ప్రత్యేక వ్యాక్సిన్‌


 ‘సీరమ్‌’కు డీసీజీఐ పచ్చజెండా.. ప్రయోగాల కోసం ఉత్పత్తి 

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌పై పనిచేయగల కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు కసరత్తు చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా మరో అడుగు ముందుకు వేయనుంది. ప్రయోగ పరీక్షలు, విశ్లేషణ అవసరాల కోసం ఈ ప్రత్యేక టీకాను ఉత్పత్తి చేసేందుకు అనుమతులు కోరుతూ ‘సీరం’ సమర్పించిన దరఖాస్తుపై డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన లైసెన్సులు మంజూరు చేసింది. ఒమైక్రాన్‌ వేరియంట్‌ లక్ష్యంగా తీసుకొచ్చే ఈ ప్రత్యేక కొవిడ్‌ వ్యాక్సిన్‌ను సాంకేతిక పరిభాషలో ‘రీకాంబినంట్‌ స్పైక్‌ ప్రొటీన్‌ (ఆర్‌ఎస్‌) నానో పార్టికల్‌ వ్యాక్సిన్‌’గా పిలుస్తారు. దీని అభివృద్ధి కోసం అమెరికా కంపెనీ నోవావ్యాక్స్‌తో ‘సీరం’ జట్టుకట్టింది. 

Updated Date - 2022-02-08T06:58:34+05:30 IST