తెలంగాణలో 7కు చేరిన ఒమైక్రాన్ కేసులు

ABN , First Publish Date - 2021-12-17T02:42:27+05:30 IST

తెలంగాణలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో 4 కేసులను అధికారులు గుర్తించారు. ముగ్గురు కెన్యా దేశస్తులు, ఒకరు ఇండియాకు ...

తెలంగాణలో 7కు చేరిన ఒమైక్రాన్ కేసులు

హైదరాబాద్: తెలంగాణలో ఒమైక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మరో 4 కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు కెన్యా దేశస్తులకు, మన దేశానికి చెందిన ఒక వ్యక్తికి ఒమైక్రాన్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో మొత్తం 7 కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 190 కరోనా కేసులు నమోదు అయ్యాయి. మరోవైపు దేశవ్యాప్తంగా 70 ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. 


అటు ఒమైక్రాన్ కేసుల దృష్ట్యా జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. ఒమైక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు బల్దియా తెలిపింది. ఐసొలేషన్ కేంద్రాలను గుర్తించాలని అధికారులకు బల్దియా ఆదేశాలు ఇచ్చింది. ఒక్కో సర్కిల్‌కి ఒక్కో ఐసొలేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఒమైక్రాన్‌ కేసులు పెరిగితే సెంటర్లు పెంచేలా సన్నాహాలు చేస్తోంది. గతేడాది ఉపయోగించిన ఐసొలేషన్ కేంద్రాలకు శానిటేషన్ చేస్తున్నారు.

Updated Date - 2021-12-17T02:42:27+05:30 IST