వైరల్ అవుతున్న chocolate sandwich వీడియో చూసి ఆశ్చర్యపోయిన ఒమర్ అబ్దుల్లా.. ఎందుకంటే..

ABN , First Publish Date - 2022-06-26T00:23:44+05:30 IST

వివిధ రకాల ఆహార పదర్థాలను ఉపయోగించి తయారు చేసే శాండ్‌విచ్‌లను తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు.

వైరల్ అవుతున్న chocolate sandwich వీడియో చూసి ఆశ్చర్యపోయిన ఒమర్ అబ్దుల్లా.. ఎందుకంటే..

వివిధ రకాల ఆహార పదార్థాలను ఉపయోగించి తయారు చేసే శాండ్‌విచ్‌లను తినేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా శాండ్‌విచ్‌లను లోట్టలు వేసుకుని తింటుంటారు. తాజాగా గుజరాత్‌లోని భావనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తయారు చేసిన శాండ్‌విచ్.. జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరన్స్ పార్టీ ఉపాధ్యక్షుడు Omar Abdullaను ఆశ్చర్యపరిచింది. ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ను రీ-ట్వీట్ చేసిన ఒమర్.. `ఈ శాండ్‌విచ్ నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. దీనిని ఎలా కనుగొన్నారు? నేను గుజరాతీ వంటకాలను ఇష్టపడతాను. కానీ, ఈ ఆవిష్కరణ అద్భుతం` అని ఒమర్ పేర్కొన్నారు. 


ఆ శాండ్‌విచ్‌ను ఎలా తయారు చేశారంటే?

ముందుగా రెండు బ్రెడ్ ముక్కలను లవ్ సింబల్ షేప్‌లో కట్ చేశారు. దానిపై వివిధ రకాల క్రీములను రాశారు. ఆ తర్వాత డెయిరీ మిల్క్ కంపెనీ చాక్లెట్లను తీసుకుని వాటిని పొడిగా చేశారు. ఆ పొడిని ఓ బ్రెడ్ ముక్కపై వేశారు. దానిపై ఛీజ్ పెట్టి ముక్కలుగా కట్ చేసిన రెండు ఐస్ క్రీమ్‌లను దానిపై పెట్టారు. మరో బ్రెడ్ ముక్కను దానిపై పెట్టారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. 



Updated Date - 2022-06-26T00:23:44+05:30 IST