ఒమన్‌లో నైట్ కర్ఫ్యూ !

ABN , First Publish Date - 2021-03-26T13:09:04+05:30 IST

గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశం ఒమన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.

ఒమన్‌లో నైట్ కర్ఫ్యూ !

మస్కట్: గత కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశం ఒమన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 28 నుంచి ఏప్రిల్ 8 వరకు నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయని సుప్రీం కమిటీ తెలిపింది. కొద్దిరోజులుగా కేసులు భారీగా పెరుగుతున్న కారణంగా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అన్ని దుకాణాలు, కాఫీ షాప్స్, రెస్టారెంట్స్, ఇతర వ్యాపార సముదాయాలు కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉన్న సమయంలో పూర్తిగా మూసి ఉంచాలని ఈ సందర్భంగా కమిటీ సూచించింది. ఆంక్షలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఇదిలాఉంటే.. ఒమన్‌ను వణికిస్తున్న మహమ్మారి ఇప్పటి వరకు 1,53,838 మందికి సోకగా.. 1,650 మందిని పొట్టనబెట్టుకుంది.  

Updated Date - 2021-03-26T13:09:04+05:30 IST