భారత ప్రయాణికులపై నిషేధాన్ని పొడిగించిన ఒమన్!

ABN , First Publish Date - 2021-05-05T17:56:37+05:30 IST

కరోనా సెకండ్ వేవ్‌తో భారత్‌ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశం ఒమన్ మరోసారి భారత్ ప్రయాణికులపై నిషేధాన్ని పొడిగించింది.

భారత ప్రయాణికులపై నిషేధాన్ని పొడిగించిన ఒమన్!

మస్కట్: కరోనా సెకండ్ వేవ్‌తో భారత్‌ అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశం ఒమన్ మరోసారి భారత్ ప్రయాణికులపై నిషేధాన్ని పొడిగించింది. ఈ మేరకు ఆ దేశ సుప్రీం కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 7వ తేదీ(శుక్రవారం) నుంచి ఈ నిషేధం అమలులోకి వస్తోందని సుప్రీం కమిటీ స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని కమిటీ పేర్కొంది. భారత్‌తో పాటు సుడాన్, లెబనాన్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, నైజీరియా, టాంజానియా, ఘనా, గినియా, సియెర్రా లియోన్, ఇథియోపియా, బ్రిటన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, ఫిలిప్పీన్స్ ప్రయాణికులపై కూడా ఒమన్ బ్యాన్ విధించింది. అలాగే ఈ దేశాల మీదుగా ప్రయాణించే వారికి సైతం ఇవే నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. కాగా, ఒమన్ పౌరులు, దౌత్య వేత్తలు, హెల్త్ వర్కర్లు, వారి కుటుంబ సభ్యులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది.  


Updated Date - 2021-05-05T17:56:37+05:30 IST