Oct 27 2021 @ 16:17PM

‘ఆదిపురుష్’ షూటింగ్ పై ఓంరౌత్ మాస్టర్ ప్లాన్

రెబల్ స్టార్ ప్రభాస్ , బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న భారీ మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’. శ్రీరామునిగా ప్రభాస్, సీతాదేవిగా కృతిసనన్ , లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణుడిగా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే రావణ పాత్రధారి సైఫ్ , సీతాదేవి పాత్రధారి కృతి సనన్ తమ పాత్రలకు సంబంధించిన షూట్ ను కంప్లీట్ చేశారు. ఇక ప్రభాస్ కు సంబంధించిన పార్ట్ మాత్రమే బ్యాలెన్స్ ఉండిపోయింది. 



ఓంరౌత్ ప్రస్తుతం ప్రభాస్ పాత్ర చిత్రీకరణ మీదే ప్రధాన దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. ఒక పక్క పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటూనే మరో పక్క ప్రభాస్ షూటింగ్ పార్ట్ ను నాన్ స్టాప్ గా జరిపి.. వచ్చే నెలాఖరు లోపు షూట్  కంప్లీట్ చేయాలని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. ఇలా చేస్తేనే వచ్చే ఏడాది ఆగస్ట్ లో విడుదలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన భావిస్తున్నారట. పౌరాణిక చిత్రం కాబట్టి, ‘ఆదిపురుష్’ చిత్రానికి భారీ సిజీ వర్క్ ఉంటుంది. నవంబర్ లో టాకీ పార్ట్ కంప్లీట్ అయితే, మిగిలిన తొమ్మిది నెలల్ని  గ్రాఫిక్స్ కోసం కేటాయించాలని ఆయన ఆలోచనగా తెలుస్తోంది. మరి ఓం రౌత్ ఈ సినిమాను ప్రకటించిన తేదీలోనే విడుదల చేయగలరేమో చూడాలి.